నువ్వు పెద్దకొడుకు అయితే మేము బతకడం కష్టమే: చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్

Published : Mar 19, 2019, 04:23 PM IST
నువ్వు పెద్దకొడుకు అయితే మేము బతకడం కష్టమే: చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్

సారాంశం

చంద్రబాబును నమ్మి పిల్లనిచ్చారు దివంగత సీఎం ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. పిల్లనిచ్చిన మామ అని కూడా చూడకుండా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడుని ఏపీ ప్రజలు దత్తత తీసుకుంటే ఇక బతకడం కష్టమేనన్నారు.   

అవనిగడ్డ: చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని పెద్ద కొడుకుగా ఏ ఒక్కరూ అంగీకరించరని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు లాంటి వెన్నపోటు వ్యక్తి మీకు పెద్దకొడుకుగా కావాలా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. 

చంద్రబాబును ఎవరైనా దత్తత తీసుకుంటారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును నమ్మి పిల్లనిచ్చారు దివంగత సీఎం ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. పిల్లనిచ్చిన మామ అని కూడా చూడకుండా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడుని ఏపీ ప్రజలు దత్తత తీసుకుంటే ఇక బతకడం కష్టమేనన్నారు. 

పింఛన్ పెంచి తాను పెద్దకొడుకును అయ్యానని చెప్తున్న చంద్రబాబు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలలో భాగంగా రూ.2000 ప్రకటించకపోతే పింఛన్ పెంచేవాడా అంటూ నిలదీశారు వైఎస్ జగన్. 

ఈ వార్తలు కూడా చదవండి

బాహుబలి సినిమా చూపించి తప్పించుకుంటారు: చంద్రబాబుపై జగన్ ఫైర్

జనసేనకు గుడ్ బై చెప్పిన మాజీమంత్రి తనయుడు: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యర్రా

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు