జమ్మలమడుగులో వైసీపీ వాహనం ధ్వంసం

Published : Mar 19, 2019, 04:13 PM IST
జమ్మలమడుగులో వైసీపీ వాహనం ధ్వంసం

సారాంశం

 కడప జిల్లా జమ్మలమడుగు సంజామలలో మంగళవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది.వైసీపీకి చెందిన వాహనాన్ని కొందరు ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. 

జమ్మలమడుగు: కడప జిల్లా జమ్మలమడుగు సంజామలలో మంగళవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది.వైసీపీకి చెందిన వాహనాన్ని కొందరు ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. 

జమ్మలమడుగులో వైసీపీకి చెందిన వాహనాన్ని ధ్వసం చేయడంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది.

ధ్వంసమైన వాహనాన్ని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు వైసీపీ అభ్యర్ధి సుధీర్ రెడ్డిలు పరిశీలించారు. టీడీపీ కార్యకర్తలే ఉద్దేశ్యపూర్వకంగా వాహనాన్ని ధ్వంసం చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు.

ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మోహరింపుతో  పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  పోలీసులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.


 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు