కేసీఆర్‌తో జగన్ దోస్తీ: శివాజీ సంచలన కామెంట్స్

By narsimha lodeFirst Published Apr 7, 2019, 11:49 AM IST
Highlights

తెలంగాణ సీఎంతో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ స్నేహం చేయడం పులి మీద స్వారీ చేయడం లాంటిదేనని సినీ నటుడు శివాజీ చెప్పారు.

అమరావతి:తెలంగాణ సీఎంతో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ స్నేహం చేయడం పులి మీద స్వారీ చేయడం లాంటిదేనని సినీ నటుడు శివాజీ చెప్పారు.

ఆదివారం నాడు సినీ నటుడు శివాజీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.పోలవరం ప్రాజెక్టు,  రాజధానిపై ట్రూత్‌ పేరుతో సినీ నటుడు శివాజీ మీడియా సమావేశంలో  వీడియోను ప్రదర్శించారు.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదన్నారు.వైఎస్ఆర్ రాజకీయ వారసుడిగా వైఎస్ జగన్ ఎదిగారని చెప్పారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదన్నారు. ఏపీ ప్రజల కోసమే తాను పోరాటం చేస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. తనకు కుల గజ్జి కూడ లేదని స్పష్టం చేశారు.

జగన్‌పై నమోదైన కేసులు, సీబీఐ దాఖలు చేసిన చార్జీషీటులను శివాజీ వివరించారు. జగన్‌కు రాజకీయ అనుభవం లేదన్నారు. కేసీఆర్‌తో జగన్ దోస్తీ చేయడం పులి మీద స్వారీ చేయడం లాంటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి కాదని ఆయన తేల్చి చెప్పారు.

జగన్ తన స్వంతి ఇంటి నిర్మాణం  కోసం మూడున్నర ఏళ్లు పట్టిందన్నారు. అదే రాజధాని, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంత సమయం పడుతోందో ఆలోచించాలని ఆయన కోరారు.

ఏపీకి హోదాపై గతంలో టీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలను ఎవరైనా ఖండించారా అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో నలుగురు సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారని శివాజీ గుర్తు చేశారు. ఇందులో జగన్‌పై కేసులున్నాయని ఆయన చెప్పారు. రాజకీయ అనుభవం లేదన్నారు.  

పవన్ కళ్యాణ్‌కు చదువు లేకపోవడం ఆయనకు నష్టం చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే అదే సమయంలో అనుభవం ఉంటే నష్టం లేదని చెప్పారు. అతి తక్కువగా చదువుకొన్న కేఏ పాల్‌ ప్రపంచంలో పలు దేశాల అధినేతలతో సంబంధాలు ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ ఆయన తన స్థాయిని తానే తగ్గించుకొన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

వాన్‌పిక్ భూముల్లో పోర్టు నిర్మాణానికి కేసీఆర్ ప్లాన్: శివాజీ

ఆపిల్‌ లాంటి సంస్థలను ఏపీకి రాకుండా అడ్డుకొన్నారు: శివాజీ

టీడీపీ గెలవకపోతే అమరావతి నుండి రాజధాని తరలింపు: శివాజీ సంచలనం

పోలవరం పూర్తి చేసే వారికే ఓటేయండి: శివాజీ

click me!