ఆపిల్‌ లాంటి సంస్థలను ఏపీకి రాకుండా అడ్డుకొన్నారు: శివాజీ

By narsimha lodeFirst Published Apr 7, 2019, 10:57 AM IST
Highlights

మోడీ కారణంగా ఏపీకి  ఆపిల్ లాంటి కొన్ని సంస్థలు రాకుండా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని సినీ నటుడు శివాజీ ఆరోపించారు. చంద్రబాబునాయుడు బ్రాండ్ ఇమేజీ కారణంగానే రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చాయన్నారు.

అమరావతి: మోడీ కారణంగా ఏపీకి  ఆపిల్ లాంటి కొన్ని సంస్థలు రాకుండా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని సినీ నటుడు శివాజీ ఆరోపించారు. చంద్రబాబునాయుడు బ్రాండ్ ఇమేజీ కారణంగానే రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చాయన్నారు.

ఆదివారం నాడు సినీ నటుడు శివాజీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.పోలవరం ప్రాజెక్టు,  రాజధానిపై ట్రూత్‌ పేరుతో సినీ నటుడు శివాజీ మీడియా సమావేశంలో  వీడియోను ప్రదర్శించారు.

రాయలసీమ ప్రాంతంలో కొన్ని కంపెనీల్లో సినీ నటుడు పర్యటించి ఉపాధి పొందుతున్న వారితో మాట్లాడారు. శ్రీసిటీలో పలు కంపెనీల్లో ఉపాధి లభిస్తున్న విషయం వాస్తవమేనని శివాజీ వివరించారు.

చంద్రబాబుకు ఉన్న అనుభవంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సరళతరం చేయడం వల్ల పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చినట్టుగా ఆయన చెప్పారు.

సెల్‌కాన్, కార్బన్, డిక్సన్  కంపెనీల్లో  స్థానికులకు ఉపాధిని కల్పించారని ఆయన వివరించారు. శ్రీసీటీ 10 వేల ఎకరాల్లో విస్తరించినట్టు చెప్పారు. శ్రీసీటీలో 400 కంపెనీలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కంపెనీల్లో సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని చెప్పారు.ఇప్పటికే 40 కంపెనీలు ఏర్పాటు చేస్తే సుమారు 40 వేల మందికి ఉపాధి దొరకనుందన్నారు.

ఈ కంపెనీల్లో మహిళలకు ఎక్కువగా ఉద్యోగాలు వచ్చినట్టు ఆయన వివరించారు. కియా పరిశ్రమను ఏపీలో ఏర్పాటు కావడానికి బాబు బ్రాండ్ ఇమేజ్ కారణమని ఆయన వివరించారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీష్  ఇదే విషయాన్ని ప్రస్తావించిన శివాజీ గుర్తు చేశారు.కియా ఏర్పాటులో బాబు కీలకంగా వ్యవహరించారన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం  రాష్ట్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీలను ఇచ్చిందన్నారు. ఆపిల్ లాంటి సంస్థలు ఏపీకి రాకుండా మోడీ అడ్డుపుల్ల వేశారని శివాజీ ఆరోపించారు.

ఏపీకి కేంద్రం నుండి రూ.22వేల కోట్లు  రావాల్సి ఉందని శివాజీ చెప్పారు. నెంబర్ గేమ్ కోసం కొన్ని పార్టీలు దుర్మార్గాన్ని చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. లోటు బడ్జెట్‌  ఉన్న కూడ ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు,  ఉపాధి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన వివరించారు.

సంబంధిత వార్తలు

టీడీపీ గెలవకపోతే అమరావతి నుండి రాజధాని తరలింపు: శివాజీ సంచలనం

పోలవరం పూర్తి చేసే వారికే ఓటేయండి: శివాజీ


 

click me!