ఈసీ తీరును నిరసిస్తూ సెక్రటేరియట్‌లో బాబు ధర్నా

By narsimha lodeFirst Published Apr 10, 2019, 2:18 PM IST
Highlights

కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సెక్రటేరియట్ 5వ బ్లాక్ వద్ద ధర్నాకు  దిగారు.
 


అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సెక్రటేరియట్ 5వ బ్లాక్ వద్ద ధర్నాకు  దిగారు.

ఏపీ రాష్ట్రంలో టీడీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఐటీ దాడులు కొనసాగించడం  తదితర పరిణామాలను నిరసిస్తూ చంద్రబాబునాయుడు బుధవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధానాకాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి వినతి పత్రం సమర్పించారు.

ద్వివేదిని కలిసిన తర్వాత చంద్రబాబునాయుడు ఈసీ తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు.సెక్రటేరియట్‌లోని ఐదో బ్లాక్‌లో ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి కార్యాలయం ఉంటుంది. ద్వివేదిని కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు అదే బ్లాక్ వద్ద బైఠాయించి నిరసనను వ్యక్తం చేశారు.

ఎన్నికల సంఘం  అనుసరిస్తున్న తీరు ఏకపక్షంగా ఉందని చంద్రబాబునాయుడు ద్వివేది కూడ  దృష్టికి తెచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేలా చూడాలని బాబు ద్వివేది దృష్టికి తీసుకొచ్చారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఈసీ వ్యవహరిస్తోందని బాబు అభిప్రాయపడ్డారు. వైసీపీ ఆరోపణల ఆధారంగానే ఈసీ చర్యలు తీసుకోవడంపై బాబు తీవ్రంగా మండిపడ్డారు.ఎన్నికల కమిషన్ దారుణంగా వ్యవహరిస్తోందని బాబు ఆరోపించారు. బాబుతో పాటు ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు కూడ ఈ ధర్నాలో పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే ఎన్నికల ప్రధానాధికారి వద్దకు సీఎం హోదాలో ఉన్న వ్యక్తులు వెళ్లి ఫిర్యాదులు చేయడం అసాధారణమైన పరిణామమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈసీ తీరును నిరసిస్తూ బాబు ధర్నా కూడ చేశారు. మరో వైపు టీడీపీ నేతలు ద్వివేదికి ఫిర్యాదు చేయడాన్ని వైసీపీ తప్పుబట్టింది.

సంబంధిత వార్తలు

వైసీపీ ఏది చెబితే అది చేస్తుంది: ఈసీపై చంద్రబాబు ఫైర్

ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదితో బాబు భేటీ

చంద్రబాబు ఆగ్రహం: ఈసీకి నిరసన లేఖ

ఈసీ తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి: నిరసనకు రెడీ

click me!