ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదితో బాబు భేటీ

By narsimha lodeFirst Published Apr 10, 2019, 1:31 PM IST
Highlights

ఏపీలో టీడీపీ అభ్యర్థులను లక్ష్యంగా  చేసుకొని ఐటీ దాడులు చేయడంపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారుల ఏకపక్ష బదిలీ చేయడంపై చంద్రబాబునాయుడు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి నిరసన వ్యక్తం చేశారు.
 

అమరావతి: ఏపీలో టీడీపీ అభ్యర్థులను లక్ష్యంగా  చేసుకొని ఐటీ దాడులు చేయడంపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారుల ఏకపక్ష బదిలీ చేయడంపై చంద్రబాబునాయుడు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి నిరసన వ్యక్తం చేశారు.

బుధవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏపీ సచివాలయంలోని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ఏపీ రాష్ట్రంలోని టీడీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఐటీ దాడులు చేయడం వంటి పరిణామాలపై  చంద్రబాబునాయుడు ఈసీ తీరుపై చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. ఈ లేఖను ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే ఏపీ ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మలను ఇప్పటికే బదిలీ చేశారు. మంగళవారం నాడు రాత్రి ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌ను కూడ బదిలీ చేశారు. 

సంబంధిత వార్తలు

చంద్రబాబు ఆగ్రహం: ఈసీకి నిరసన లేఖ

ఈసీ తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి: నిరసనకు రెడీ

click me!