కుప్పంలో చంద్రబాబుదే హవా

By narsimha lodeFirst Published Mar 11, 2019, 4:00 PM IST
Highlights

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ నుండి బరిలోకి దిగుతున్నారు. 1989 నుండి ఈ అసెంబ్లీ స్థానం నుండి చంద్రబాబునాయుడు టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధిస్తున్నారు.

చిత్తూరు: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ నుండి బరిలోకి దిగుతున్నారు. 1989 నుండి ఈ అసెంబ్లీ స్థానం నుండి చంద్రబాబునాయుడు టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధిస్తున్నారు. మరోసారి ఇదే స్థానం నుండి ఆయన బరిలోకి దిగనున్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబునాయుడు శ్రీవెంకటేశ్వరయూనివర్శిటీలో చదువుకొనే సమయంలోనే రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవాడు. యూత్ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా ఆ సమయంలో పనిచేశారు.

1978లో చంద్రగిరి నుండి చంద్రబాబునాయుడు తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అంజయ్య  మంత్రి వర్గంలో చంద్రబాబుకు సినిమాటోగ్రఫీగా అవకాశం దక్కింది. 

మంత్రిగా ఉన్న సమయంలోనే చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరీని వివాహం చేసుకొన్నాడు. ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేసిన సమయంలో కూడ చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.

1983 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి  టీడీపీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరారు.1989లో కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ నుండి చంద్రబాబునాయుడు తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి దొరస్వామినాయుడుపై ఆయన నెగ్గారు.

1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి  బాబు విజయం సాధించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి , అవశేష ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబునాయుడు కుప్పం నుండే ప్రాతినిథ్యం వహించడం విశేషం.2014లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయాయి.గత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు తన కుటుంబసభ్యులతో కలిసి హైద్రాబాద్‌లోనే ఓటు వేశారు.ఆ తర్వాత చంద్రబాబునాయుడు తన ఓటును ఏపీకి బదిలీ చేయించుకొన్నారు.

click me!