ఆళ్లగడ్డ వైసీపీ ప్రచార సభలో వెదజల్లిన కరెన్సీ నోట్లు

Published : Apr 04, 2019, 02:02 PM IST
ఆళ్లగడ్డ వైసీపీ ప్రచార సభలో వెదజల్లిన కరెన్సీ నోట్లు

సారాంశం

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి గంగుల బ్రిజేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన సభలో స్థానిక నేత ఒకరు  కరెన్సీ నోట్లను జనం మీదకు వెదజల్లారు.    


కర్నూల్: కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి గంగుల బ్రిజేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన సభలో స్థానిక నేత ఒకరు  కరెన్సీ నోట్లను జనం మీదకు వెదజల్లారు.  

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే బ్రిజేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆళ్ళగడ్డ టీడీపీ అభ్యర్ధి, మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేస్తున్నారు.

ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోని సిరివెళ్లలో ఈ ఘటన బుధవారం  నాడు చోటు చేసుకొంది. వైసీపీ అభ్యర్థి బ్రిజేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో  కరెన్సీ నోట్లు వెదజల్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

ఈ డబ్బును తీసుకొనేందుకు జనం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకొంది. ఈ ఘటనలో కొందరు గాయపడినట్టుగా చెబుతున్నారు. అయితే ఎందరు గాయపడ్డారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మరో వైపు కరెన్సీ నోట్లు వెదజల్లిన విషయమై వైసీపీ అభ్యర్ధి బ్రిజేంద్రరెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అభ్యర్ధి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఈ విషయమై ఈసీకి కూడ టీడీపీ నేతలు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్