గృహ నిర్మాణాలకు అప్పులు: జగన్ బంపర్ ఆఫర్

By narsimha lodeFirst Published Apr 4, 2019, 12:59 PM IST
Highlights

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇళ్ల నిర్మాణం కోసం తీసుకొన్న అప్పులను రద్దు చేస్తామని  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

నెల్లూరు: తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇళ్ల నిర్మాణం కోసం తీసుకొన్న అప్పులను రద్దు చేస్తామని  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

గురువారం నాడు నెల్లూరులో నిర్వహించిన వైసీపీ ఎన్నికల సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు.టీడీపీ ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు తీసుకోవాలని  ఆయన కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం  ఇళ్ల కోసం ఇచ్చే రుణాలను మాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు.

పేద విద్యార్థులకు చదువు చెప్పించాలనే ఉద్దేశ్యం చంద్రబాబుకు లేదన్నారు. ప్రాధమిక విద్య నుండి ఇంజనీరింగ్ చదివే వరకు విద్యను ప్రైవేటీకరించారని జగన్ ఆరోపించారు.

నాలుగున్నర ఏళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేయని చంద్రబాబునాయుడు  ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్  విమర్శించారు.తమ పార్టీ అధికారంలోకి  రాగానే ప్రజలకు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలను చేపట్టనున్నట్టు జగన్ హామీ ఇచ్చారు. చంద్రబాబు చెప్పే మోసపు వాగ్ధానాలను నమ్మకూడదని జగన్ ప్రజలను కోరారు.

సంబంధిత వార్తలు

తాజా సర్వే: జగన్‌దే హవా, పవన్ నామమాత్రమే

 

click me!