చంద్రబాబు ఫోర్త్ ప్లేస్: గూగుల్ యాడ్స్‌పై జగన్ ఖర్చు ఇదీ

By narsimha lodeFirst Published Apr 4, 2019, 1:27 PM IST
Highlights

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో గూగుల్‌లో ప్రచారం కోసం (అడ్వర్‌టైజ్‌మెంట్స్)  రాజకీయ పార్టీలు భారీ ఎత్తున డబ్బులను ఖర్చు చేస్తున్నాయి. 

న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో గూగుల్‌లో ప్రచారం కోసం (అడ్వర్‌టైజ్‌మెంట్స్)  రాజకీయ పార్టీలు భారీ ఎత్తున డబ్బులను ఖర్చు చేస్తున్నాయి. గూగుల్‌లో ప్రచారం కోసం బీజేపీ అత్యధికంగా ఖర్చు చేస్తే ఆ తర్వాతి స్థానంలో  వైసీపీ నిలిచింది. కాంగ్రెస్ పార్టీ ఆరో స్థానంలో నిలిచినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది.

రాజకీయ పార్టీలు తమ ప్రచారం కోసం ఎన్ని యాడ్స్, ఎంత ఖర్చు చేశారనే విషయమై నివేదికను ఈ మేరకు గురువారం నాడు గూగుల్ విడుదల చేసింది.గూగుల్‌లో ఇప్పటికే  831 యాడ్స్‌ కోసం అన్ని రాజకీయ పార్టీలు రూ.37 కోట్లను ఖర్చు పెట్టాయి.

గూగుల్‌‌లో అత్యధికంగా బీజేపీ యాడ్స్‌ను ఇచ్చింది. 554 యాడ్స్‌ కోసం రూ. 1.21 కోట్లను ఖర్చు చేసినట్టుగా గూగుల్ ప్రకటించింది.గూగుల్ యాడ్ రెవిన్యూలో ఇది 32 శాతంగా ఆ సంస్థ తెలిపింది.బీజేపీకి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ  కేవలం 14 యాడ్స్ కోసం రూ. 54,100 ఖర్చు చేసింది. బీజేపీ తర్వాతి స్థానంలో వైసీపీ నిలిచింది.

వైసీపీ 107 యాడ్స్ ఇచ్చింది. దీని కోసం ఆ పార్టీ రూ.1.04 కోట్లను ఖర్చు చేసింది. పమ్మి సాయి చరణ్ రెడ్డి దీని కోసం డబ్బులను ఖర్చు చేసినట్టుగా గూగుల్ ప్రకటించింది. మరో యాడ్స్ సంస్థ కూడ 43 యాడ్స్‌పై రూ. 26,400లను ఖర్చు చేసినట్టుగా గూగుల్ ప్రకటించింది.

ప్రమన్యా స్ట్రాటజీ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ , డిజిటల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీడీపీ యాడ్స్‌ను ప్రమోట్ చేసినట్టుగా గూగుల్ ప్రకటించింది.టీడీపీ గూగుల్‌లో యాడ్స్ ఇవ్వడంలో నాలుగో స్థానంలో నిలిచినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది.ప్రమన్యా స్ట్రాటజీ కన్సల్టింగ్  సంస్థ  53 యాడ్స్ కోసం రూ.85.25 లక్షలను ఖర్చు చేసినట్టుగా గూగుల్ ప్రకటించింది. 36 యాడ్స్ కోసం డిజిటల్ కన్సల్టింగ్ సంస్థ రూ.63.43 లక్షలను కేటాయించినట్టుగా తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి  ఎక్కువగా గూగుల్‌కు యాడ్స్ కోసం  వచ్చినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. రూ.1.73 కోట్ల ఈ రాష్ట్రం నుండి వచ్చాయని ఆ సంస్థ తెలిపింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం నిలిచింది. 

తెలంగాణకు చెందిన పార్టీలు సుమారు రూ. 72 లక్షలను ఖర్చు చేశాయి. యూపీ నుండి రూ. 18 లక్షలు, మహారాష్ట్ర నుండి రూ.17 లక్షలను ఖర్చు చేసినట్టుగా గూగుల్ ప్రకటించింది.తమ అడ్వర్‌టైజ్‌మెంట్ పాలసీకి విరుద్దంగా ఉన్న4 అడ్వర్‌టైజ్‌మెంట్లను గూగుల్ రద్దు బ్లాక్ చేసింది.


 

click me!