పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తాం: బందరులో జగన్ హామీ

By narsimha lodeFirst Published Apr 8, 2019, 12:45 PM IST
Highlights

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు పక్కా ఇళ్లను ప్రభుత్వమే నిర్మిస్తోందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
 

మచిలీపట్నం: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు పక్కా ఇళ్లను ప్రభుత్వమే నిర్మిస్తోందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

సోమవారం నాడు మచిలీపట్నంలో  నిర్వహించిన వైసీపీ ఎన్నికల సభలో జగన్ పాల్గొన్నారు.వైఎస్ మరణించిన తర్వాత మచిలీపట్నం పోర్టును మర్చిపోయారన్నారు. నిరుద్యోగుల్ని బాబు మోసం చేశారని జగన్ ఆరోపించారు.మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం చంద్రబాబునాయుడు 33వేల ఎకరాల కోసం బాబు సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాము కేవలం 4500 ఎకరాలను మాత్రమే పోర్టు కోసం సేకరించనున్నట్టు ఆయన  హామీ ఇచ్చారు. చేపల వేటకు మత్స్యకారులు విరామం ఇచ్చే సమయంలో ప్రతి నెలకు రూ.10వేలను అందిస్తామని జగన్ ప్రకటించారు.

పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబునాయుడు మహిళలను మోసం  చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాబు విమర్శించారు. 2014 ఎన్నికల మేనిఫెస్టో‌లో ఇచ్చిన హామీలను టీడీపీ అమలు చేయలేదని జగన్ ఆరోపించారు.
 

click me!