డైరెక్ట్ పోటీ పడలేక చిల్లర రాజకీయాలు: నారాయణపై అనిల్ ఫైర్

Siva Kodati |  
Published : Apr 04, 2019, 03:14 PM IST
డైరెక్ట్ పోటీ పడలేక చిల్లర రాజకీయాలు: నారాయణపై అనిల్ ఫైర్

సారాంశం

మంత్రి నారాయణపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం నగరంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన జగన్ ప్రభంజనంలో తానెక్కడ కొట్టుకుపోతానోనని నారాయణ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అనిల్ మండిపడ్డారు

మంత్రి నారాయణపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం నగరంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన జగన్ ప్రభంజనంలో తానెక్కడ కొట్టుకుపోతానోనని నారాయణ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అనిల్ మండిపడ్డారు.

ఆయన ఎంతలా దిగజారిపోయారంటే... నేను ఏడాదిన్నర క్రితం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..ఒక సైనికుడు యుద్ధానికి వెళ్లినప్పుడు తన చేతిలో రెండే ఆప్షన్లు మాత్రమే ఉంటాయని చనిపోవడమా.. లేదా శత్రువును చంపడమా..? ఆ విధంగా ప్రతి కార్యకర్త ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని చెప్పానన్నారు.

దానిని ఇప్పుడు తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి ఎన్నికల సభల్లో మాట్లాడానని చెప్పి ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఇలా చిల్లర రాజకీయాలు చేయకుండా డైరెక్ట్‌గా తనతో పోరాడాల్సిందిగా నారాయణకు సూచించారు.

తాను గత ఐదేళ్లలో మంత్రి నారాయణను నిలదీసిన వీడియోలను రోజుకొకటి వేస్తారట.. రోజుకొకటి కాదు.. గంటకో వీడియో వేసుకో....తన వెనుక నెల్లూరు సిటీ ప్రజలు ఉన్నారన్నారు.

నీ కళాశాలలో 80 మంది విద్యార్థులు చనిపోయారు.. ఒక్కరి కుటుంబాన్నైనా ఓదార్చారా..? నువ్వా మానవత్వం గురించి మాట్లాడేది. మీ కూతురి కన్నా చిన్న వయసున్న 21 ఏళ్ల అమ్మాయి మెడికల్ కాలేజీలో చనిపోతే కనీసం చూడటానికి వెళ్లారా అని మంత్రిని ప్రశ్నించారు. ఆ కూతురు చనిపోయినట్లు నా బిడ్డా, మీ బిడ్డా చనిపోతే ఓటే వేస్తారా అని ప్రజలను ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్