అందరూ చంద్రన్నకే ఓటని చెబుతున్నారు.. మాగంటి రూప

Published : Apr 04, 2019, 04:25 PM IST
అందరూ చంద్రన్నకే ఓటని చెబుతున్నారు.. మాగంటి రూప

సారాంశం

ఎంపీ మురళీ మోహన్ కోడలు, రాజమండ్రి లోక్ సభ టీడీపీ అభ్యర్థి మాగంటి రూప.. విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. 

ఎంపీ మురళీ మోహన్ కోడలు, రాజమండ్రి లోక్ సభ టీడీపీ అభ్యర్థి మాగంటి రూప.. విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. అనపర్తి నియోజకవర్గంలో ఆమె గురువారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలను టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

కాగా.. ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. తన పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా అన్నదాతను ఆదుకున్న ఆపద్భాందవుడికే తమ ఓటని చెబుతున్నారన్నారు. మహిళలు అయితే చంద్రన్నకే తమ ఓటని చెబుతున్నారని రూప పేర్కొన్నారు. 

తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని.. వాళ్ల ఆశీర్వాదమే తమకు శ్రీరామ రక్షని అన్నారు. చంద్రబాబు కష్టానికి ఫలితంగా ప్రజలు ఈ విధంగా స్పందిస్తున్నారని ఆమె అన్నారు. ఎక్కడికి వెళ్లినా పసుమయం కనిపిస్తుందని, అదే ప్రజల నాడని రూప పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్