జగన్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు: పులివెందులలో చంద్రబాబు

By narsimha lodeFirst Published Apr 1, 2019, 5:55 PM IST
Highlights

పులివెందులలో జగన్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ తరహా ట్యాక్స్‌ తాను ఏనాడూ చూడలేదని  ఆయన  అభిప్రాయపడ్డారు.
 

పులివెందుల: పులివెందులలో జగన్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ తరహా ట్యాక్స్‌ తాను ఏనాడూ చూడలేదని  ఆయన  అభిప్రాయపడ్డారు.

సోమవారం నాడు కడప జిల్లా పులివెందులలో నిర్వహించిన ఎన్నికల సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు  పాల్గొన్నారు.పులివెందులలో జగన్‌ ట్యాక్స్ కడుతున్నారని బాబు ఆరోపించారు. జగన్ ఆటలు సాగనివ్వనని చంద్రబాబునాయుడు చెప్పారు. మార్కెటింగ్ ట్యాక్స్,  జీఎస్టీ ట్యాక్స్‌ను తాను చూశాను... కానీ పులివెందులలో జగన్ ట్యాక్స్ ఏమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

40 ఏళ్లుగా ఒకే కుటుంబానికి అధికారాన్ని  ఇస్తున్నారని ఆయన చెప్పారు. 20 ఏళ్లుగా టీడీపీ అభ్యర్ధి సతీష్ రెడ్డి వైఎస్ కుటుంబంపై పోరాటం చేస్తున్నాడని ఆయన గుర్తు చేశారు. ఈ దఫా సతీష్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.

ఈ ప్రాంత ప్రజలకు ప్రాణాంతకమైన యురేనియం ప్రాజెక్టును వైఎస్ఆర్ తీసుకొచ్చాడని  చంద్రబాబునాయుడు విమర్శించారు.  తాను మాత్రం  ప్రజలకు  అవసరమైన ప్రాజెక్టులను తీసుకొస్తానని బాబు హామీ ఇచ్చారు.ముస్లింలు జగన్‌కు ఒక్క ఓటు వేసినా కూడ ఆ ఓటు జగన్‌కు వేసినట్టేనని చంద్రబాబునాయుడు  చెప్పారు.  

పులివెందులకు నీళ్లివ్వాలని సతీష్ రెడ్డి గడ్డం పెంచిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. కుప్పం కంటే ముందే పులివెందులకు నీళ్లిచ్చినట్టు ఆయన గుర్తు చేశారు.  గండికోటలో 20 టీఎంసీలను నీళ్లను నిలిపి ప్రతి ఎకరానికి  నీటిని అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.రాయలసీమను రత్నాల సీమగా మారుస్తామన్నారు. ఏపీకి నమ్మకద్రోహం చేసిన మోడీతో జగన్ లాలూచీ పడ్డారని చంద్రబాబునాయుడు ఆరోపించారు.  మన ఆస్తులను లాక్కొన్న కేసీఆర్ తో జగన్ కుమ్మక్కయ్యారని ఆయన విమర్శలు గుప్పించారు.

ఏపీ ప్రజలను కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు తిట్టిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. సంక్షేమాన్ని ఇస్తాను, మీ జీవితాల్లో వెలుగును నింపుతానని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. కియా మోటార్స్  అనంతపురానికి  మోడీ వల్లే వచ్చిందని జగన్ చెప్పడాన్ని చంద్రబాబునాయుడు తప్పుబట్టారు.

మన రాష్ట్రంలో ఉండని జగన్‌కు మాత్రం ఏపీ ప్రజల ఓట్లు కావాలంటే ఎలా అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఆత్మగౌరవాన్ని జగన్ తాకట్టు పెట్టారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. పులివెందులలో ఏకపక్షంగా ఓటింగ్ జరగాలని ఆయన కోరారు.  మొన్ననే పులివెందులలో జరిగే అరాచకాలను మీరు చూశారు.. అలాంటి అరాచకాలను చేసేందుకు అవకాశం ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.

సీపీఎస్‌ను రద్దు చేస్తాం: ఉద్యోగులకు బాబు హామీ

మోడీ వర్సెస్ బాబు: ట్విట్టర్ వార్

 


 

click me!