వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంలో రివిజన్ పిటిషన్ వేస్తాం: బాబు

Published : Apr 08, 2019, 05:10 PM IST
వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంలో రివిజన్ పిటిషన్ వేస్తాం: బాబు

సారాంశం

వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై  అవసరమైతే సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్‌ దాఖలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.


తిరువూరు: వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై  అవసరమైతే సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్‌ దాఖలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.

సోమవారం నాడు కృష్ణా జిల్లా తిరువూరులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. వీవీప్యాట్ల లెక్కింపు విషయమై తాము చేసిన డిమాండ్‌పై ఈసీ పట్టించుకోలేదన్నారు.

దీంతో 21 పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు ఆయన చెప్పారు.  ఒక్క ఈవీఎంలకు బదులుగా ఐదు ఈవీఎంలలోని వీవీప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఐదు ఈవీఎంలలోని వీవీ ప్యాట్లే కాదు కనీసం 25 శాతం ఈవీఎంల వీవీ ప్యాట్లను లెక్కించాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.ఈ విషయమై సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీం కీలక ఆదేశాలు

 

 

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్