నేను మా అన్న చిరంజీవి మాటే వినను.. పవన్ కళ్యాణ్ కామెంట్స్

Published : Apr 08, 2019, 03:16 PM IST
నేను మా అన్న చిరంజీవి మాటే వినను.. పవన్ కళ్యాణ్ కామెంట్స్

సారాంశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా.. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినా కూడా.. పవన్ తన ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేయడం లేదు. 


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా.. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినా కూడా.. పవన్ తన ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేయడం లేదు. తాజాగా ఆయన అమలాపురంలో రోడ్ షో నిర్వహించారు.

కాగా.. ఈ రోడ్ షోలో ఆయన చేసిన కామెంట్స్ అభిమానులను షాకింగ్ కి గురిచేసాయి. తాను తన సోదరుడు చిరంజీవి మాట విననంటూ పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

అయితే.. అవి తోట త్రిమూర్తులను ఉద్దేశించి చేయడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే.. ఇటీవల తోట త్రిమూర్తులు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జనసేన, టీడీపీ ఓకటేనని పేర్కొన్నారు. దీనిపై పవన్ చాలా ఘాటుగా స్పందించారు.

టీడీపీ- జనసేన ఒకటేనని తోట త్రిమూర్తులు దుష్ప్రచారం చేస్తున్నారని, తోట త్రిమూర్తులులాంటి వారిని చెంచాలు అంటారని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పవన్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘‘నా అన్న చిరంజీవి మాటే వినను...నీ మాట ఎలా వింటా. వేరే కులం వాడినని నన్ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. మిగతా కులాలు మీకు ఊడిగం చేయాలా? టీడీపీ నేతలు బానిస బతుకులు బతుకుతున్నారు. జగన్‌లా నేను టికెట్లను అమ్ముకోలేదు’’ అని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్