అలా మాట్లాడితే జైలుకే: వైసీపీ అభ్యర్థులకు బాబు వార్నింగ్

Published : Apr 03, 2019, 02:58 PM IST
అలా మాట్లాడితే జైలుకే: వైసీపీ అభ్యర్థులకు బాబు వార్నింగ్

సారాంశం

చావడమో, చంపడమో ఉండదు... ఇక అలా మాట్లాడితే నేరుగా జైలుకే వెళ్తారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు

 ఆత్మకూరు:  చావడమో, చంపడమో ఉండదు... ఇక అలా మాట్లాడితే నేరుగా జైలుకే వెళ్తారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

బుధవారం నాడు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు.చావడమో, చంపడమో ఉంటుందని ఓ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అనిల్ కుమార్ చేసిన ప్రకటనపై చంద్రబాబునాయుడు స్పందించారు. హత్యలు, శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే చూస్తూ  ఊరుకోనని చంద్రబాబునాయుడు ప్రకటించారు. 

 హత్యలు చేస్తామంటే శాశ్వతంగా జైల్లోనే ఉంటారని బాబు హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొంటామని చెబితే చూస్తూ ఊరుకోనని బాబు చెప్పారు.వైసీపీ అధికారంలోకి వస్తే వీధికో రౌడి పుట్టుకొస్తాడని చెప్పారు. పులివెందులో జగన్ చెడపుట్టాడని చంద్రబాబునాయుడు విమర్శించారు. పులివెందుల ప్రజలు చాలా మంచోళ్లని ఆయన చెప్పారు. పులివెందులలలో తాను నిర్వహించిన సభకు అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు. 
 

సంబంధిత వార్తలు

తెలంగాణలో నాకే గౌరవం లేకుండా పోయింది: చంద్రబాబు

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్