
వైసీపీ అధినేత జగన్ సభలో అపశృతి చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జగన్ గుంటూరులో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ఐలాండ్ సెంటర్ లో బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభకు ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు. కాగా ఈ క్రమంలో సభలో ఒక్కసారిగా కరెంట్ తీగలు తెగిపడటంతో 10మందికి షాక్ తగిలింది. వీరిలో ఒకరిపరిస్థితి విషమంగా ఉండగా మిగిలిన వారంతా క్షేమంగానే ఉన్నారు. అప్రమత్తమైన కార్యకర్తలు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.