జగన్ జైలు పక్షి.. ఆళ్ల కోర్టు పక్షి.. లోకేష్

Published : Apr 08, 2019, 12:53 PM IST
జగన్ జైలు పక్షి.. ఆళ్ల కోర్టు పక్షి.. లోకేష్

సారాంశం

ఏపీ మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్... తన నియోజకవర్గంలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.ఈ ప్రచారంలో వైసీపీ అధినేత జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి పై విమర్శలు కురిపించారు.

మంగళగిరిలో తనను ఓడించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్.. రూ.200కోట్లు పంచారని లోకేష్ ఆరోపించారు.  జగన్ జైలు పక్షి అని..వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ కోర్టు పక్షి అని చమత్కరించారు. అనంతరం మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ గుజరాత్ కి వెళ్లే సమయం దగ్గరపడిందని జోస్యం చెప్పారు.

రాజధానికి భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైసీపీ మేనిఫెస్టోలో అమరావతి ప్రస్తావన లేదన్నారు. మన రాష్ట్ర తాళాలు దొంగకి ఇస్తామా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తారు. తాము చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్