పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మిత్రుడు అలీ కౌంటర్

Published : Apr 09, 2019, 07:12 AM IST
పవన్ కల్యాణ్  వ్యాఖ్యలకు మిత్రుడు అలీ కౌంటర్

సారాంశం

తాను పుట్టి పెరిగింది రాజమండ్రిలోనే అని అలీ చెప్పారు. తాను పుట్టిన గడ్డకు తన తండ్రి పేరును ట్రస్ట్ పెట్టుకుని కులమతాలకు అతీతంగా సేవ చేస్తున్నానని చెప్పారు. రాజమండ్రిలో పవన్ తనపై చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయని చెప్పారు.

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తనపై చేసిన వ్యాఖ్యలకు ఆలీ కౌంటర్ ఇచ్చారు. అలీకి తాను సాయం చేసినట్లు పవన్ కల్యాణ్ రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అలీ స్పందించారు. 

తాను పుట్టి పెరిగింది రాజమండ్రిలోనే అని అలీ చెప్పారు. తాను పుట్టిన గడ్డకు తన తండ్రి పేరును ట్రస్ట్ పెట్టుకుని కులమతాలకు అతీతంగా సేవ చేస్తున్నానని చెప్పారు. రాజమండ్రిలో పవన్ తనపై చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయని చెప్పారు. పవన్ చుట్టుప్రక్కల ఉన్నవారు ఆలీ మీద వ్యాఖ్యలు చేయాలని చెప్పి ఉంటారని, దాని వల్లనే పవన్ వ్యాఖ్యలు చేసి ఉంటారని అన్నారు.  

చిరంజీవి వేసిన బాటలో పవన్ కల్యాణ్ వచ్చారని, కానీ తాను తన బాట వేసుకుని పైకి వచ్చానని అలీ చెప్పారు. తాను చాలా జిల్లాలో వైసిపి కోసం ప్రచారం చేశానని, తాను పవన్  స్థానాన్ని గుండెల్లో పెట్టుకున్నానని అన్నారు. పవన్ ఎప్పుడూ బావుండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి లైన్‌లో మొదటిగా ఉండే వ్యక్తిని తాను అని చెప్పారు.

సంబంధిత వార్త

స్నేహమంటే ఇదేనా: అలీపై మండిపడ్డ పవన్

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్