చంద్రబాబుకు మరో షాక్: టీడీపీకి పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి రాజీనామా?

Published : Mar 06, 2019, 12:15 PM IST
చంద్రబాబుకు మరో షాక్: టీడీపీకి పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి రాజీనామా?

సారాంశం

 నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేరును చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. 

నెల్లూరు: నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేరును చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. దీంతో ఈ స్థానం నుండి టీడీపీ టిక్కెట్టు ఆశించిన పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తికి లోనయ్యారు. టీడీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.

నెల్లూరు జిల్లా కోవూరు సెగ్మెంట్ నుండి  పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డికే  టిక్కెట్టు ఇవ్వనున్నట్టు చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. ఈ పరిణామం పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డికి రుచించలేదు.  

ఇదే టిక్కెట్టు కోసం ఆశతో ఉన్న పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి బాబు నిర్ణయంతో  అసంతృప్తికి  గురయ్యాడు. పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలతో సమావేశమయ్యారు.  టీడీపీకి రాజీనామా చేసే యోచనలో పెళ్లకూరు ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఆయన ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu