32 అత్యాచారాలు, 4 హత్యలు...ఏపీలో మరో దండుపాళ్యం గ్యాంగ్

By Siva KodatiFirst Published Mar 5, 2019, 8:41 AM IST
Highlights

పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెం బౌద్ధారామాల వద్ద గత నెల 24న శ్రీధరణిపై లైంగిక దాడి, హత్యపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ ముఠా అరాచకాలు వెలుగుచూశాయి.

దండుపాళ్యం పేరుతో కన్నడ నాట జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా వచ్చిన సినిమా దక్షిణాదిన ఎంతటి సంచలనం కలిగించిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వాళ్లపై మూకుమ్మడిగా దాడి చేసి, ఒంటరిగా ఉన్న మహిళలు, యువతులపై అత్యాచారానికి పాల్పడుతుంది.

ఆ ఇంట్లో నగదు, నగలు కాజేసి ఏమి తెలియని వారిలా రోడ్దు మీదకు వచ్చేస్తారు ముఠా సభ్యులు. అచ్చం ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో ఓ గ్యాంగ్ చెలరేగిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెం బౌద్ధారామాల వద్ద గత నెల 24న శ్రీధరణిపై లైంగిక దాడి, హత్యపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ ముఠా అరాచకాలు వెలుగుచూశాయి.

కృష్ణాజిల్లా మైలవరం మండలం చంద్రాల గ్రామానికి చెందిన పొట్లూరి అంకమరావు అలియాస్ రాజు బాల్యమంతా మామిడి తోటల్లోనే గడిపాడు. తండ్రి గ్రామంలోని మామిడి తోటలకు కాపలాగా ఉండటంతో.. అంకమరావు కూడా తండ్రి వెంట వెళ్లేవాడు.

ఈ సమయంలో మామిడి కాయల కోసం వచ్చే అడవి పందులను కర్రతో కొట్టడంతో అది విలవిలలాడుతూ చనిపోయేది. ఈ సమయంలో దాని పెనుగులాటను చూసి అంకమరావు తెగ ఆనందించేవాడు.

ఆ తర్వాత ఇదే పద్ధతుల్లో మనుషులను సైతం వేటాడటం మొదలుపెట్టాడు. పెళ్లీడు రావడంతో అంకమరావుకి పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు.

అత్తమామలు మామిడి తోటల్లో కాపలాదారులు. ఇతనికి బావమరుదులు తుపాకుల సోమయ్య, గంగయ్య, ఆగిరిపల్లి మండలానికి చెందిన నాగరాజులు జత కలిశారు. కృష్ణాజిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన యువకుడు, ఆగిరిపల్లి మండలానికి చెందిన యవతి వరుసకు బావామరదళ్లు అవుతారు.

2017 డిసెంబర్‌లో ఏకాంతంగా గడిపేందుకు9 గాను సిలువగట్టు తోటల్లోకి వెళ్లారు. అక్కడ సంచరిస్తున్న ఈ ముఠా వీరిపై దాడి చేసి ల్యాప్‌టాప్, నగదు, నగలు దోచుకున్నారు. అంతటితో ఆగకుండా యువతిపై అత్యాచారం చేశారు.

పరువు పోతుందన్న భయంతో దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నేరం బయటకు రాకపోవడంతో అంకమరావు రెచ్చిపోయాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు-వి.అన్నవరం గ్రామాల మధ్య గల సుబాబుల్ తోటల్లోకి ఓ ఆటోడ్రైవర్ తన ప్రియురాలిని తీసుకుని వెళ్లాడు.

వీరిని గమనించిన అంకమరావు.. కర్రతో ఆటోడ్రైవర్‌ను కొట్టి చంపేశాడు. అనంతరం అతని ప్రియురాలిపై అత్యాచారం చేశాడు. ఈమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక ఊహాచిత్రాన్ని రూపొందించి విడుదల చేశారు.

ఈ ఘటనతో తనపై పోలీసుల నిఘా ఎక్కువగా ఉందని భావించిన అంకమరావు తన మకాంను పశ్చిమగోదావరి జిల్లాకు మార్చాడు. నాటి నుంచి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక అత్యాచారాలు, హత్యలు, దోపిడీలతో ఈ ముఠా రెచ్చిపోయింది.

పర్యాటక ప్రాంతాలు, పార్కులు, తోటలు, నిర్మానుష్య ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి అందమైన యువతులను టార్గెట్ చేస్తారు. యువకులను చితక్కొట్టమో లేదంటే చంపేయడమో చేస్తారు. అనంతరం వారి ప్రియురాళ్లతో కామవాంఛ తీర్చుకుంటారు. అలా ఇప్పటి వరకు మొత్తం 32 అత్యాచారాలు, 4 హత్యలు చేశారు. 

శ్రీధరణిపై అత్యాచారం, హత్య: నలుగురి అరెస్ట్

'దండుపాళ్యం' సినిమా ఎఫెక్ట్: 14 మందిపై రేప్

శ్రీధరణి హత్య: రాజు బాగోతాలు వెలుగులోకి...
శ్రీధరణి హత్యకేసులో ట్విస్ట్: రాజు ఆచూకీ ఇలా దొరికింది

click me!