ఏలూరు:శ్రీధరణిని హత్య చేసిన నిందితుడు రాజును విచారించిన పోలీసులు విస్మయానికి గురయ్యారు. దండుపాళ్యం సినిమా ప్రభావంతో సీరియల్ మర్డర్లు చేసినట్టుగా గుర్తించారు. అంతేకాదు14 మందిపై రాజు అత్యాచారాలకు పాల్పడినట్టుగా ఈ విచారణలో పోలీసులు గుర్తించారు.

పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలోని గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద ఈ నెల 24వ తేదీన శ్రీధరణిని రాజు హత్య చేశాడు. ఏకాంతం కోసం వచ్చిన శ్రీధరణి, నవీన్‌లపై రాజు దాడి చేశాడు.ఈ దాడిలో  శ్రీధరణి అక్కడికక్కడే మృతి చెందగా, నవీన్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కృష్ణా జిల్లా మైలవరం మండలం చండ్రాల గ్రామానికి చెందిన పొట్లూరు రాజు సైకోగా మారాడు.దండుపాళ్యం సినిమా ప్రేరణతో ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలపై దాడికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు.

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన  యువతిని రాజు వివాహం చేసుకొన్నాడు. ఆరు మాసాల క్రితం ఆయన తన మకాన్ని జి.కొత్తపల్లికి  మార్చాడు. అక్కడే ఉన్న ఓ జీడి మామిడి తోటకు కాపలా ఉన్నాడు. భార్యతో కలిసి ఆ తోటలోనే నివాసం ఉంటున్నాడు.

గుంటుపల్లి బౌద్ధారామాల వద్దకు వచ్చే పర్యాటకులు, ప్రేమికులను రాజు బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకొని  రాజు దాడికి పాల్పడుతున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 24వ తేదీన బౌద్ధారామాల వద్ద  శ్రీధరణి, ఆమె ప్రియుడు ఏకాంతంగా రాజు కంటపడ్డారు.

రాజు వారిద్దరిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత నవీన్‌పై దాడికి దిగాడు. మరో వైపు శ్రీధరణిని కూడ కొట్టాడు. అయితే కొద్దిసేపటికే ఆమె తప్పించుకొనేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన రాజు ఆమె కాళ్లు విరిచేశాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను హత్య చేశాడు.  నవీన్ కూడ చనిపోయాడని  భావించి రాజు అక్కడి నుండి వెళ్లిపోయాడు. కానీ, నవీన్ ప్రాణాలతో బయటపడ్డాడు. 

రాజు సుమారు 14 మంది యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  వీరిలో నలుగురు యువతులపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత వారిని హత్య చేశాడు.  మొబైల్ డంప్ టెక్నాలజీతో రాజును పోలీసులు పట్టుకొన్నారు.

సంబంధిత వార్తలు

శ్రీధరణి హత్య: రాజు బాగోతాలు వెలుగులోకి...
శ్రీధరణి హత్యకేసులో ట్విస్ట్: రాజు ఆచూకీ ఇలా దొరికింది