రైలులో భారీ అగ్నిప్రమాదం... ఏపీలో తప్పిన పెను ముప్పు

Siva Kodati |  
Published : Mar 05, 2019, 07:46 AM IST
రైలులో భారీ అగ్నిప్రమాదం... ఏపీలో తప్పిన పెను ముప్పు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం తృుటిలో తప్పిపోయింది. రైలులో అగ్నిప్రమాదం సంభవించి ఒక బోగీ తగలబడిపోయింది. వివరాల్లోకి వెళితే.. యశ్వంత్‌పూర్ నుంచి టాటానగర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌... తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మీదుగా వెళుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం తృుటిలో తప్పిపోయింది. రైలులో అగ్నిప్రమాదం సంభవించి ఒక బోగీ తగలబడిపోయింది. వివరాల్లోకి వెళితే.. యశ్వంత్‌పూర్ నుంచి టాటానగర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌... తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మీదుగా వెళుతోంది...

తెల్లవారుజామున సుమారు 2.15 గంటల ప్రాంతంలో పాంట్రీకార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వీటిని గుర్తించిన ప్రయాణికులు వెంటనే చైను లాగారు... వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది కూడా బోగీలను వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

లేదంటే మంటలు ఇతర బోగీలకు సైతం వ్యాపించి ఉండేవి. సమాచారం అందుకున్న రైల్వే, అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా? క్లారిటీ వచ్చేదెలా?
Gade Sai Krishna Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం సీఐ నాగరాజు అరెస్ట్ | Asianet News Telugu