శ్రీధరణి మర్డర్: 32 అత్యాచారాలు, నాలుగు హత్యలు

By narsimha lodeFirst Published Mar 4, 2019, 2:31 PM IST
Highlights

బౌద్ధారామాల వద్ద ప్రేమ జంటపై దాడికి పాల్పడడంతో  శ్రీధరణి మృతి చెందింది. ఈ ఘటనలో గాయపడిన నవీన్ ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు

ఏలూరు:  బౌద్ధారామాల వద్ద ప్రేమ జంటపై దాడికి పాల్పడడంతో  శ్రీధరణి మృతి చెందింది. ఈ ఘటనలో గాయపడిన నవీన్ ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీధరణిని హత్య చేసిన ముఠా 14 నెలల్లో నాలుగు హత్యలు, 32 మందిపై అత్యాచారాలకు పాల్పడినట్టుగా  పోలీసులు చెప్పారు. శ్రీధరణిని హత్య చేసిన నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టుగా పశ్చి మగోదావరి  జిల్లా పోలీసులు ప్రకటించారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏస్పీ రవిప్రకాష్ ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు.  పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం అర్జావారిగూడెం‌కు చెందిన దౌలూరి నవీన్‌కుమార్  అదే మండలంలోని  ఓ గ్రామానికి చెందిన  డిగ్రీ విద్యార్ధిని శ్రీధరణిని ప్రేమించాడు.  వీరిద్దరూ సెలవు రోజుల్లో  బయటకు వెళ్తున్నారు. గత నెల 24వ తేదీన  కామవరపుకోట మండలం జీలకర్రగూడెం సమీపంలోని బౌద్ధారామాల వద్దకు వెళ్లారు.

అడవి ప్రాంతంలోని ఓ తుప్ప వద్ద ప్రేమ జంట ఉన్నారు. ప్రేమ జంట ఏకాంతంగా ఉన్న విషయాన్ని గుర్తించిన రాజు గ్యాంగ్ తొలుత నవీన్‌పై దాడికి దిగారు. నవీన్ స్ఫృహ కోల్పోయాడు. వెంటనే  శ్రీధరణిపై రాజు గ్యాంగ్ దుస్తులను చింపేశారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను కొట్టి చంపారు. రాజు ఒక్కడే అత్యాచారానికి పాల్పడ్డాడా, మిగిలిన సభ్యులు కూడ రేప్‌కు పాల్పడ్డారా అనే విషయమై ఆరా తీస్తున్నట్టు ఎస్పీ చెప్పారు.

రాజు గ్యాంగ్ ఏకాంతం కోసం వచ్చే ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడేవారు. ఇప్పటికే మూడు హత్యలు, 32 మంది యువతులపై అత్యాచారాలకు పాల్పడినట్టుగా  పోలీసులు చెప్పారు. రాజు గ్యాంగ్‌పై ఇప్పటివరకు ఎవరూ కూడ ఫిర్యాదు చేయకపోవడంతో నేరాలు మరింత పెట్రేగిపోయినట్టు చెప్పారు.

2017 డిసెంబర్‌లో నూజివీడు సమీపంలో ఒక మామిడి తోటకు వచ్చిన ప్రేమ జంటపై దృష్టి పెట్టాడు రాజు. యువకుడిని తలపై బలంగా కొట్టడంతో ఆ యువకుడు పడిపోయాడు. ఆ తరువాత యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా వారి వద్ద ఉన్న బంగారు నగలు, నగదును అపహరించుకుపోయాడు. ఈ విషయమై ప్రేమ జంట పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో రాజు ఇవే పనులకు పాల్పడ్డాడు.

తొలుత రాజు ఒక్కడే ఈ పనిచేసేవాడు. ఆ తర్వాత తనతో పాటు తన ఇద్దరు బావమరుదులను, బంధువులను కలుపుకొన్నాడు.నిందితుల నుండి నాటు తుపాకీ ఒకటి, ఒక కత్తి, ఒక కర్ర, సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 

వీరి వద్ద ఇంకా నాటు తుపాకీలు, ఆయుధాలు ఉన్నట్టు గుర్తించామని, పోలీసు కస్టడీ అనంతరం వాటిని స్వాధీనం చేసుకోనున్నట్టు చెప్పారు. యువతి నుంచి అపహరించిన కాళ్ల పట్టీలను ఒకరి వద్ద తాకట్టు పెట్టారని, వాటిని కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు. నిందితులపై రౌడీ షీట్లు తెరుస్తున్నామని ఎస్పీ చెప్పారు.

సంబంధిత వార్తలు

శ్రీధరణిపై అత్యాచారం, హత్య: నలుగురి అరెస్ట్

'దండుపాళ్యం' సినిమా ఎఫెక్ట్: 14 మందిపై రేప్

శ్రీధరణి హత్య: రాజు బాగోతాలు వెలుగులోకి...
శ్రీధరణి హత్యకేసులో ట్విస్ట్: రాజు ఆచూకీ ఇలా దొరికింది

click me!