టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారి టీడీపీపై పోటీ చేస్తా, తేల్చుకోండి: చంద్రబాబుకు కీలకనేత అల్టిమేటం

By Nagaraju penumalaFirst Published Mar 4, 2019, 3:27 PM IST
Highlights

మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర డిప్యూటీ సీఎం చినరాజప్పకే కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో అభ్యర్థి మార్పుపై పునరాలోచించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేశారు. 
 

కాకినాడ: అభ్యర్థుల ఎంపిక టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అభ్యర్థులు ప్రకటించడం ఒక ఎత్తైతే అసంతృప్తులను బుజ్జగించడం మరో ఎత్తైంది. గెలుపుగుర్రాలను ఎంపిక చెయ్యడమే ఓ సవాల్ అయితే మిగిలిన ఆశావాహులను బుజ్జగించడం మరో పెద్ద సవాల్ గా మారింది.

 తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి భగ్గుమంది. పెద్దాపురం టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కరరామారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్దాడలో పార్టీ కార్యకర్తలు, అనుచరులతో సమావేశం అయిన బొడ్డు పెద్దాపురం టికెట్ ఇస్తారని చివరి వరకు ఆశించానని అయితే ఇవ్వకుండా మెుంచి చెయ్యిచూపారంటూ ధ్వజమెత్తారు. 

మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర డిప్యూటీ సీఎం చినరాజప్పకే కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో అభ్యర్థి మార్పుపై పునరాలోచించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేశారు. 

అయినా మార్పు రాకపోతే పార్టీ మారి తెలుగుదేశం పార్టీపై పోటీ చేస్తానని హెచ్చరించారు. లేకపోతే ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగుతానని తెలిపారు. మరోవైపు తనను రాజమహేంద్రవరం ఎంపీగా బరిలోకి దించాలని చూస్తున్నారని తాను ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చెయ్యనని తెగేసి చెప్పారు. అసెంబ్లీకి వెళ్తానని పార్లమెంట్ కు వెళ్లేది లేదని బొడ్డు భాస్కరరామారావు స్పష్టం చేశారు.    

ఈ వార్తలు కూడా చదవండి

మురళీమోహన్ స్థానంలో రాజమండ్రి టీడీపీ అభ్యర్థి ఈయనే

click me!