నన్ను బెదిరించే ధైర్యం ఎవరికీ లేదు: వైసీపీ నేత రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు

Published : Mar 04, 2019, 02:59 PM IST
నన్ను బెదిరించే ధైర్యం ఎవరికీ లేదు: వైసీపీ నేత రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు

సారాంశం

వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ తో కలిసి నడిచేందుకే తిరిగి వైసీపీలో చేరినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరిస్తేనే టీడీపీ నేతలు వైసీపీలోకి వస్తున్నారంటూ చేసిన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.   

హైదరాబాద్: తనను బెదిరించే ధైర్యం తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ లేదని వైసీపీ నేత, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. తాను వైసీపీలోకి వచ్చింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతోనేనని చెప్పుకొచ్చారు. 

వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ తో కలిసి నడిచేందుకే తిరిగి వైసీపీలో చేరినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరిస్తేనే టీడీపీ నేతలు వైసీపీలోకి వస్తున్నారంటూ చేసిన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తనకు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడా వ్యాపారాలు లేవన్నారు. అయినా తనను బెదిరించే ధైర్యం ఎవరికీ లేదన్నారు రఘురామకృష్ణం రాజు. రఘురామకృష్ణం రాజు ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు