ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 లక్షల మందిని బలితీసుకుంటూ బంధువులను, కుటుంబసభ్యులను దహనక్రియలకు దూరం చేస్తున్న సమయంలో చిత్తూరు జిల్లా వరదాయ్యపాళ్యంలో ఓ కుటుంబంలో మానవత్వం పరిళమించేలా వ్యవహరించిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు.
చిత్తూరు: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 లక్షల మందిని బలితీసుకుంటూ బంధువులను, కుటుంబసభ్యులను దహనక్రియలకు దూరం చేస్తున్న సమయంలో చిత్తూరు జిల్లా వరదాయ్యపాళ్యంలో ఓ కుటుంబంలో మానవత్వ పరిళమించేలా వ్యవహరించిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. భర్త మృతదేహాన్ని తన కొడుకుతో కలిసి భార్య దహనక్రియలు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటలను తూచ తప్పకుండా పాటించారని నారాయణ స్వామి అన్నారు.
బుధవారం మంత్రి తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాపించి మృత్యువాత పడ్డ మృతదేహాలను పలుచోట్ల కుటుంబసభ్యుల కడచూపుకు నోచుకోకుండా గ్రామస్తులు, బంధువులు అడ్డుకోవడం మానవత్వం కాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఎంతో ముందుచూపుతో ఆనాడే కరోనా వైరస్ తో ప్రజలు మమేకమై జీవనం సాగించక తప్పదని తెలిపారని గుర్తు చేశారు.
undefined
read more కోవిడ్‌పై రాజకీయాలు చేయడం చంద్రబాబు, లోకేష్, పవన్ లకే చెల్లింది: వెల్లంపల్లి
కరోనా వైరస్ తో మరణిస్తే మృతదేహంపై కేవలం 6 గంటల వరకే వైరస్ జీవించి ఉంటుందని అన్నారు. కొందరు మూఢనమ్మకాలను, సోషల్ మీడియాలో కనిపించే అసత్య ప్రచారాలను నమ్మి కరోనా వైరస్ తో మృతి చెందిన మృతదేహాలను ఖననం చేయడాన్ని అడ్డుకుంటూ మానవత్వాన్ని మర్చిపోతున్నారని అన్నారు.
అయితే జిల్లాలోని వరదయపాళ్యం మాజీ జెడ్పీటీసీ వెంకటకృష్ణయ్య కరోనా వైరస్ తో మృతి చెందితే.. అతని భార్య పద్మమ్మ, కుమారుడు తిలక్ లు ఆ మృతదేహాన్ని తమ సొంత పొలంలో తమ చేతుల మీదుగా ఖననం చేసి మానవత్వాన్ని నిలుపుకున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ అలాంటివారిని ఆదర్శంగా తీసుకుని కరోనా వైరస్ తో మృతి చెందినవారిని మానవతా ధృక్పథంతో అపోహలను వీడి బంధువులే కర్మక్రియలు చేసుకునేలా చూడాలన్నారు.
కరోనా వైరస్ సోకినవారిని అంతరానివారిగా చూడడం కాదని వారికి సేవలు అందించి మానవత్వాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. సామాజిక దూరం, మాస్క్ లు ధరించి, ప్రభుత్వ ఆదేశాలు పాటించడంతోనే కరోనా మహమ్మారి కట్టడి సాధ్యం అన్నారు మంత్రి నారాయణ స్వామి.