అదనపు కట్నం .. ఆడపిల్ల అని వదిలించుకోవడానికి సాకులు, మూడు పెళ్లిళ్లు

Siva Kodati |  
Published : Jul 29, 2020, 06:48 PM ISTUpdated : Jul 29, 2020, 06:53 PM IST
అదనపు కట్నం .. ఆడపిల్ల అని వదిలించుకోవడానికి సాకులు, మూడు పెళ్లిళ్లు

సారాంశం

ముగ్గురు మహిళలను ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లాడిన ఉపాధ్యాయుడు శీలం సురేశ్ ఘటనలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. 

ముగ్గురు మహిళలను ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లాడిన ఉపాధ్యాయుడు శీలం సురేశ్ ఘటనలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అవనిగడ్డకు చెందిన శీలం సురేశ్ చాట్రాయి మండలంలోని మర్రిబంధం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 2011లో శాంతిప్రియ అనే యువతిని వివాహం చేసుకున్నాడు.

అదనపు కట్నం కోసం ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ కారణంతోనే శాంతిప్రియను వదిలేశాడు. ఆ తర్వాత తనకు ఇంతకుముందే పెళ్లిందనే విషయాన్ని దాచి 2015లో శైలజ అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు.

కట్నం కింద నాలుగు లక్షల రూపాయలు, పది సవర్ల బంగారం తీసుకున్నాడు. ఆడపిల్లకు జన్మనిచ్చిందనే సాకుతో శైలజతో తెగదెంపులు చేసుకుని 2019లో అనూష అనే ఉపాధ్యాయిని రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న శైలజ, అత్తలపై దాడి చేశాడు. అతని మోసంపై జిల్లా విద్యాశాఖాధికారితో పాటు దిశ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు పెళ్లిళ్లకు సహకరించిన సురేశ్ తల్లిదండ్రులు, అన్నయ్యపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

తమలాగా మరో మహిళ మోసపోకముందే సురేశ్‌ను అరెస్ట్ చేయాలని శైలజ విజ్ఞప్తి చేశారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని ఆమె తేల్చి చెప్పారు. బాధిత భార్యలకు మహిళా సంఘాలు అండగా నిలిచాయి.

సురేశ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సురేశ్ బాగోతంపై ఆయన మొదటి భార్య శాంతి ప్రియ స్పందించారు. తనలాగే మరో ఇద్దరిని కూడా మోసం చేశాడని తెలిసి బాధపడ్డానని తెలిపారు.

సురేశ్‌పై చర్యలు తీసుకోకుంటే మరింత మందిని మోసం చేస్తారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సురేశ్ మోసంపై తాను కేసు పెట్టినప్పుడే చర్యలు తీసుకుని వుంటే ఇద్దరు మహిళలకు అన్యాయం జరిగేది కాదని శాంతిప్రియ వాపోయారు.

రూ. 10 లక్షలు కట్నం తీసుకుని ఇంకా కావాలని తనను సురేశ్ వేధించేవాడని ఆరోపించారు. పుట్టింట్లో ఘనంగా పుట్టినరోజు జరుపుతానని చెప్పి వదిలేసి కనిపించకుండా వెళ్లాడని ఆమె చెప్పారు.

సురేశ్‌కు పలుకుబడి ఉండటం వల్ల ఏ కేసులోనూ చిక్కకుండా తప్పించుకుంటున్నాడని శాంతిప్రియ ఆరోపించారు. తమకు న్యాయం చేయకుంటే త్వరలోనే మహిళా కమీషన్‌ను కూడా కలుస్తానని శాంతిప్రియ స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu