వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో మిథున్ రెడ్డి ఆయనతో ఇవాళ విజయవాడలో భేటీ అయ్యారు.
విజయవాడ: వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తో ఆ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి మంగళవారంనాడు విజయవాడలో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలకు పైగా పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయన తనయుడు సూర్యప్రకాష్ తో ఆయన చర్చించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ మారుతారని ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంటికి నిన్న టీడీపీ నేత రెడ్డి సుబ్రమణ్యం వెళ్లారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ పెద్ద కొడుకు గుండె ఆపరేషన్ కావడంతో పరామర్శకు వెళ్లినట్టుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ భేటీ వెనుక రాజకీయ మతలబు ఉందనే ప్రచారం కూడ సాగుతుంది. మరో వైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్ఆర్‌సీపీని వీడి జనసేనలో చేరుతారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ ప్రచారాల నేపథ్యంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, సూర్యప్రకాష్ లతో మిథున్ రెడ్డి విజయవాడలో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. పార్టీని వీడొద్దని పిల్లి సుభాష్ చంద్రబోస్ ను మిథున్ రెడ్డి బుజ్జగించినట్టుగా సమాచారం. విజయవాడలో ఈ సమావేశం ముగిసిన తర్వాత కాకినాడకు వెళ్లిపోయారు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయన తనయుడు సూర్యప్రకాష్. ఇదిలా ఉంటే రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలకు పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ముందు మీడియాతో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడే అవకాశం ఉందని సమాచారం.
undefined
వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి మంత్రి చెల్లుబోయిన వేణుకు టికెట్టిస్తే తాను మద్దతివ్వనని పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చి చెప్పారు. అవసరమైతే పార్టీని కూడ వీడుతానని ప్రకటించారు. అంతేకాదు రామచంద్రాపురం నుండి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చి చెప్పారు.
also read:రామచంద్రాపురం వైసీపీలో పోరు: జనసేన వైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ చూపు
రామచంద్రాపురంలో పరిణామాలపై వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో ఆ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి నిన్న సమావేశమయ్యారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తీరుపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎంపీ మిథున్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.