
విజయవాడ : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓ పిచ్చికుక్క... పెళ్లాలను మార్చినంత ఈజీగానే పార్టీలు కూడా మారుస్తాడంటూ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తమ నాయకుడిపై మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ జనసేన నాయకులు విజయవాడలో ఆందోళనకు దిగారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో జనసైనికులు రోడ్డుపైకి చేరుకుని పిచ్చి కుక్క జోగి రమేష్ అంటూ నినాదాలు చేసారు. రోడ్డుపైనే మంత్రి దిష్టిబొమ్మను దగ్దం చేసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న పోలీసులు అమ్మిశెట్టితో పాటు ఇతర నాయకులను అరెస్ట్ చేసారు. ఈ సమయంలో పోలీసులకు, జనసైనికులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఆందోళన సమయంలో అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ... మంత్రి జోగి రమేష్ ని పిచ్చికుక్కని కొట్టినట్లు కొట్టాలన్నారు. ఒక బ్రోకర్, జోకర్ గాడయిన జోగికి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. కేవలం బ్రోకర్ పనులుచేసే ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవికి జోగి పొందాడన్నారు. అధికారిక కార్యక్రమంలో తప్పుడుమాటలు మాట్లాడిన మంత్రిని అక్కడేవున్న ముఖ్యమంత్రి అడ్డుకోకపోవడం దారుణమన్నారు. తప్పు అని చెప్పాల్సిన సీఎం జగన్ మంత్రి మాటలను సమర్దించడం సిగ్గుచేటని అమ్మిశెట్టి పేర్కొన్నాడు.
వీడియో
బాబాయ్ ని చంపి ఆ సానుభూతిని వాడకుని మీ నాయకుడు అధికారంలోకి వచ్చాడు... అలా మేము రాలేదురా అంటూ జోగి రమేష్ కు అమ్మిశెట్టి చురకలు అంటించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ప్రజాధనాన్ని దోచుకుంటుంటే పవన్ మాత్రం తన కష్టార్జితాన్ని ప్రజలకు పంచుతున్నాడని అన్నారు. ఇలా అడ్డగోలుగా దోచిన ప్రజాధనంతో కేవలం పవన్ ను బూతులు తిట్టడానికే సభలు నిర్వహిస్తున్నారని అన్నారు. దమ్ముంటే మంత్రి పదవి పక్కన పెట్టి రారా చూసుకుందాం అంటూ జోగి రమేష్ కు అమ్మిశెట్టి సవాల్ చేసాడు.
Read More పవన్ ఒక పిచ్చి కుక్క.. పెళ్లాలను మార్చినట్టుగా పార్టీలను మారుస్తున్నాడు: జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు
అధికార మదంతో తమ అభిమాన నాయకుడు పవన్ గురించి నోటికొచ్చినట్లు వాగుతున్న మంత్రి జోగిని జన సైనికులు విజయవాడ నడిరోడ్లపై బట్టలూడదీసి కొడతారని అమ్మిశెట్టి వాసు హెచ్చరించారు. ఎక్కడ తనకు జగన్ సీటు ఇవ్వడోనని భయపడిపోతున్న జోగి ప్రసన్నం చేసుకునేందుకే కారుకూతలు కూస్తున్నాడని అన్నారు. కేవలం ఎనిమిది నెలల్లో వైసిపి ప్రభుత్వం, మంత్రి జోగి రమేష్ ఇంటికి పోవడం ఖాయమని అమ్మిశెట్టి వాసు అన్నారు.