6,17,585 కోట్లు...బాబు దోచుకున్న మొత్తం: జగన్

By sivanagaprasad kodatiFirst Published Jan 6, 2019, 2:49 PM IST
Highlights

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులు 6,17,585 కోట్లు దోచుకున్నారని విమర్శించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. టీడీపీ ప్రభుతవ్ంలో జరిగిన అక్రమాలు, నిధుల దారి మళ్లీంపునకు సంబంధించి ఆధారాలతో సహా రాసిన ‘‘ అవినీతి చక్రవర్తి’’ పుస్తకాన్ని జగన్ శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో ఆవిష్కరించారు

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులు 6,17,585 కోట్లు దోచుకున్నారని విమర్శించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. టీడీపీ ప్రభుతవ్ంలో జరిగిన అక్రమాలు, నిధుల దారి మళ్లీంపునకు సంబంధించి ఆధారాలతో సహా రాసిన ‘‘ అవినీతి చక్రవర్తి’’ పుస్తకాన్ని జగన్ శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నవంబర్ 30 వరకు ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర టీడీపీ నేతలు చేసిన అవినీతిని, అన్యాయాలను సాక్ష్యాధారాలు, జీవో నంబర్లతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచామని జగన్ అన్నారు.

అవనీతి చక్రవర్తి పుస్తకాన్ని రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, అన్ని దర్యాప్తు సంస్థలకు అందజేస్తామని వెల్లడించారు. చంద్రబాబు ఏపీకి చేసిన అన్యాయాన్ని దేశ వ్యాప్తంగా తెలియజేయనున్నట్లు వైసీపీ చీఫ్ పేర్కొన్నారు.

ఇదే కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారామం మాట్లాడుతూ... చంద్రబాబుకు దమ్ముంటే ఈ పుస్తకాన్ని ఖండించాలని సవాల్ విసిరారు. దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబన్నారు. ఈ పుస్తకంలోని అంశాలు అవాస్తవాలైతే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

click me!