ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు: బాబుతో అలీ భేటీ, ఏం జరుగుతోంది?

By narsimha lodeFirst Published Jan 6, 2019, 2:24 PM IST
Highlights

సినీ నటుడు అలీ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను కలిసిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడును అలీ కలవడం ప్రాధాన్యత సంతరించుకొంది

అమరావతి:  సినీ నటుడు అలీ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను కలిసిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడును అలీ కలవడం ప్రాధాన్యత సంతరించుకొంది. అలీ అంతరంగంలో ఏముందో అంతుపట్టడం లేదు. ఏపీ రాజకీయాల్లో కీలకనేతలను కొన్ని గంటల వ్యవధిలోనే కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

ఏపీ రాజకీయాల్లో  సినీ నటుడు అలీ మరోసారి కేంద్ర బిందువుగా మారాడు వైసీపీలో అలీ చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో  ఆదివారం నాడు అలీ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను కలవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.

ఈ నెల 9వ తేదీన వైసీపీలో అలీ చేరుతారనే ప్రచారం సాగుతోంది.ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్‌తో అలీ రెండు గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత అలీ  జనసేనతోనే ఉంటారని కూడ జనసేన వర్గాలు ప్రకటించాయి.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లాలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరే ముందు బాబుతో అలీ సమావేశమయ్యారు. 

గత ఎన్నికల్లో గుంటూరు సిటీలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌ నుండి అలీని బరిలోకి దింపాలని టీడీపీ  భావించింది.ఆ సమయంలో  అలీ చంద్రబాబునాయుడుతో కూడ భేటీ అయ్యారు.

గత ఎన్నికల సమయంలో  అలీని పోటీ చేయించేందుకు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి తీవ్రంగా ప్రయత్నించారనే ప్రచారం ఆ సమయంలో  ప్రచారం  సాగింది. కానీ అలీ మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు.

కానీ, ఈ ఎన్నికల సమయంలో  అలీ పోటీకి రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతోంది. వైసీపీలో అలీ చేరుతారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. జనసేనతోనే అలీ ఉంటారని జనసేన వర్గాలు కూడ ప్రకటించాయి.

పవన్ కళ్యాణ్‌కు అలీ అత్యంత సన్నిహితుడుగా పేరుంది. జనసేన విజయవాడ కార్యాలయం ఏర్పాటు చేసిన సమయంలో అలీ కూడ ఆ కార్యక్రమంలో పవన్ ‌తో పాల్గొన్న విషయం తెలిసిందే.

పవన్‌ను కలిసిన తర్వాత అలీ చంద్రబాబునాయుడును కలవడం ఏపీ రాజకీయాల్లో  హాట్ టాపిక్ గా మారింది. అసలు అలీ ఏ పార్టీలో చేరుతారు. అసలు అలీ అంతరంగం ఏమిటనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

జగన్‌కు అలీ ట్విస్ట్: జనసేనానికి జై కొట్టేనా?

వైసీపీలోకి అలీ: పవన్ తో భేటీ,మతలబేంటీ?

click me!