త్వరలోనే స్మార్ట్‌ఫోన్ల పథకం: జన్మభూమి కార్యక్రమంలో బాబు ప్రకటన

By sivanagaprasad kodatiFirst Published Jan 6, 2019, 2:22 PM IST
Highlights

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి స్మార్ట్‌ఫోన్లు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ‘‘జన్మభూమి-మా ఊరు’’ కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. 

ఇప్పటికే రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశామని, పట్టణాల్లో జీ ప్లస్ త్రీ విధానంలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టంగా చెప్పామని, సహజవనరులను కాపాడుకోవాల్సిన అవసరం అందిరిపైనా ఉందన్నారు.

ప్రధాని నరేంద్రమోడీ అన్నీ రంగాల్లో విఫలమయ్యారని మోడీ ఇచ్చిన హామీలను ఆచరణలో అమలు చేయడం లేదని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో ఇబ్బందులు పడ్డామని, అలాగే మోడీని ఎవరైనా విమర్శిస్తే దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

ట్రిపుల్ తలాక్‌‌ను విమర్శించామని, ముస్లింలను అణగదొక్కాలని, బాధపెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉండే కేరళలో సుప్రీం తీర్పుతో అశాంతి రగిలించారన్నారు. అఖిలేశ్-మాయవతి సీట్ల సర్దుబాటు చేసుకుంటుంటే.. అఖిలేష్‌పై పాత కేసులు తిరగదోడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

click me!