YSRCP Plenary 2022 : ప్లీనరీకి వేళాయెరా...ఏర్పాట్లు ఇలా, కార్యక్రమాలు ఇవి...

Published : Jul 08, 2022, 10:00 AM IST
YSRCP Plenary 2022 : ప్లీనరీకి వేళాయెరా...ఏర్పాట్లు ఇలా, కార్యక్రమాలు ఇవి...

సారాంశం

గుంటూరులో రెండు రోజులపాటు జరగనున్న వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఈ రోజు ప్రారంభమయ్యింది. వర్షాలకు ఇబ్బంది కలగకుండా వాటర్ ఫ్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. 

అమరావతి : దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్ఆర్సిపి నిర్వహించనున్న ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడ గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా... 2017  జూలై ఎనిమిది, తొమ్మిది రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే.. మూడో ప్లీనరీ  నిర్వహిస్తున్నారు. ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైఎస్ఆర్ ప్రాంగణంగా నామకరణం చేశారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీ కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షులు, సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరినీ పేరుపేరునా ఆహ్వానించడంతో,  పార్టీ సభ్యులు ప్రజాప్రతినిధులు అందరూ మొదటిరోజు ప్రతినిధుల సభకు కదలి  వస్తున్నారు.

విద్యుత్ దీప కాంతులతో సభా ప్రాంగణం  దగదగలాడిపోతోంది. రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు జరిగాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ప్లీనరీకి భారీ స్థాయిలో శ్రేణులు తరలి వస్తున్నాయి. రెండో రోజున విస్తృతస్థాయి సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి వైఎస్ఆర్ సీపీ శ్రేణులు అభిమానులు తరలిరావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వర్షం వచ్చినా సరే హాజరయ్యేవారు తడవకుండా ఉండటానికి భారీ విస్తీర్ణంలో వాటర్ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు. మూడేళ్లలో చేసిన  అభివృద్ధి, సంక్షేమం  పథకాలను వివరిస్తూ ఫోటో ఎగ్జిబిషన్, పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులను గుర్తుచేస్తూ నమూనా ఏర్పాట్లు చేశారు.

మూడు వేల మంది వలంటీర్లు..
వైఎస్సార్సీపీ ప్లీనరీలో మూడు వేల మంది వలంటీర్లు పాల్గొంటున్నారని ప్లీనరీలో వాలంటీర్ కమిటీ కన్వీనర్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ప్లీనరీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే వారు ఇక్కడికి చేరుకున్నారని తెలిపారు. ఓ వైపు వర్షం పడుతున్నప్పటికీ మొక్కవోని దీక్షతో ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. 

‘జననాయక’  సీడీల  ఆవిష్కరణ…
వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ‘జననాయక’  పేరిట రూపొందించిన పాటల సీడీలను పార్టీ నేతలు, మంత్రులు కలిసి గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత పీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్ససత్యనారాయణ, విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలను వివరిస్తూ వీటిని రూపొందించారు.

ప్లీనరీలో కార్యక్రమాలు ఎలా జరుగుతాయి..
వైఎస్ఆర్సిపి ప్లీనరీకి హాజరయ్యే పార్టీ ప్రతినిధులు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి 10 గంటల వరకు పేర్లు నమోదు చేయించుకోవాలి. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుల సమావేశం జరుగుతుంది.  అటు తర్వాత సీఎం వైఎస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరించారు. దాని తర్వాత ప్లీనరీ వేదికపైకి  సీఎం వైఎస్ జగన్ ను, ప్రధాన నాయకులను ఆహ్వానిస్తారు.

జగన్ జాబ్ క్యాలెండర్ పై సైటైరికల్ కార్టూన్ తో పవన్ కల్యాణ్ ట్వీట్..

వందేమాతరం గీతాలాపనతో ప్లీనరీ మొదలౌతుంది. ఆ తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి సీఎం వైఎస్ జగన్, నాయకులు పూలమాలలు వేసి, నివాళులు అర్పిస్తారు. ప్రార్థన పూర్తయ్యాక  పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటనను సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేస్తారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్  ప్రారంభోపన్యాసం చేస్తారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సందేశం  ఇస్తారు.

పార్టీ ఆడిట్ ఖర్చుల స్టేట్మెంట్ను బి కృష్ణమోహన్ రెడ్డి ప్లీనరీ ప్రతిపాదించి ఆమోదం కోరుతారు. పార్టీని మరింత బలోపేతం చేసేలా నియమావళిని సవరణలు ప్రతిపాదించి… ప్లీనరీ ఆమోదం కోరుతారు. ఆ తర్వాత మహిళా సాధికారత - దిశ చట్టం, విద్య, నవరత్నాలు-డీబీటీ,  వైద్యం, పరిపాలన- పారదర్శకత అంశాలపై చర్చించి తీర్మానాలను ప్రవేశపెడతారు.

శనివారం సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు- ప్రోత్సాహకాలు, ఎల్లో మీడియా- దుష్టచతుష్టయంపై చర్చించి.. తీర్మానాలను ప్రవేశ పెట్టి.. ఆమోదం కోరుతారు. అధ్యక్ష ఎన్నికలు ప్రకటించి అభినందనలు  తెలుపుతారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ ముగింపు ఉపన్యాసం ఉంటుంది. ఆ తర్వాత వందన సమర్పణతో ప్లీనరీ ముగుస్తుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Launches Anna Canteen: అన్న క్యాంటీన్’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
CM Chandrababu: అన్న క్యాంటీన్లో అన్నం వడ్డించి ముచ్చటించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu