వైసీపీ ప్లీనరీలో నోరూరించే వంటకాలు: 25 రకాల వెరైటీలు, మెనూ ఇదే...

By narsimha lode  |  First Published Jul 8, 2022, 9:58 AM IST

వైసీపీ ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు సుమారు 25 రకాల వంటకాలను సిద్దం చేస్తున్నారు. పార్టీ ప్రతినిధులతో పాటు సీఎం జగన్ కు కూడా ఒకే రకమైన భోజనం అందించనున్నారు. భోజనం ఏర్పాట్లు చేసేందుకు ద్రాక్షారామం, ఇందుపల్లి నుండి సుమారు 300 మంది వంట మనుషులు వచ్చారు. 


గుంటూరు: YSRCP  plenaryకి వచ్చే ప్రతినిధులకు 25 రకాల వంటకాలను సిద్దం చేశారు.  ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాన్ని ప్రతినిధులకు అందించనున్నారు.  ఉమ్మడి East Godavari  జిల్లాలోని ద్రాక్షారామంతో పాటు ఇందుపల్లికి చెందిన 300 మంది ఈ ప్లీనరీలో వంటలు సిద్దం చేస్తున్నారు. ఇవాళ సుమారు లక్షన్నర మంది ఈ ప్లీనరీకి హాజరయ్యే అవకాశం ఉందని  పార్టీ నాయకత్వం భావిస్తుంది. మరో వైపు  రేపు జరిగే పార్టీ ప్లీనరీకి సురమారు నాలుగు లక్షల మంది హాజరు అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు Andhra Pradesh  రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన  రుచులను అందించనున్నారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర రుచులను అందించేందుకు వీలుగా Menu ను సిద్దం చేశారు. ప్లీనరీని విజయవంతం చేసేందుకు గాను పార్టీ నాయకత్వం కమిటీలను ఏర్పాటు చేసింది., భోజనాలతో పాటు పలు కమిటీలను ఏర్పాటు చేసింది. భోజనాలను సిద్దం చేసేందుకు ద్రాక్షరామానికి చెందిన వంట మనుషుల బృందం ఈ నెల 7వ తేదీన సాయంత్రమే ySR ప్లీనరీ జరిగే ప్రాంతానికి చేరుకుంది.ఇవాళ ఉదయం నుండి వంటలను సిద్దం చేస్తున్నారు. ఇవాళ ఉదయం టిఫిన్  కోసం ఇడ్లీ, పొంగల్, మైసూర్ బజ్జీ,ఉప్మా, సాంబారు, రెండు రకాల చట్నీలను సిద్దం చేశారు.

Latest Videos

undefined

మధ్యాహ్నం పూట 25 రకాల వంటకాలను సిద్దం చేయనున్నారు. శాఖాహరంతో పాటు మాంసాహారాన్ని కూడా ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు అందించనున్నారు. పార్టీ ప్రతినిధులతో పాటు సీఎం YS Jagan వరకు అందరికీ ఒకే రకమైన భోజనం అందించనున్నారు.

మధ్యాహ్నం భోజనం కోసం మటన్ ధమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, రొయ్యలు, మామిడి కాయ,వెజిటేరియన్ కూరలు, ఫ్రైడ్ రైస్ ,బిర్యానీ, సాంబారు, రసం, చేప ఫ్రై లను వంటలుగా సిద్దం చేయనున్నారు.  వీటితో పాటు మధ్య మధ్యలో స్నాక్స్ ను కూడా అందించనున్నారు. 

ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా వంటలను సిద్దం చేస్తున్నారు.  ప్లీనరీకి ఎంపిక చేసిన ప్రతినిధులే హాజరు కానున్నారు. రానున్న రోజుల్లో పార్టీ  అనుసరించనున్న వ్యూహాన్ని ఈ ప్లీనరీ వేదికగా వైఎస్‌పీ ప్రకటించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ ప్లీనరీని వైసీపీ నిర్వహిస్తుంది. వైసీపీకి చెందిన నియమావళిలో కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం లేకపోలేదు.

click me!