అధికార పార్టీ వారి వేధింపులు??.. మహిళా పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య..

Published : Jul 08, 2022, 08:32 AM IST
అధికార పార్టీ వారి వేధింపులు??.. మహిళా పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య..

సారాంశం

ఎస్టీ మహిళ అయిన ఓ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకుంది. అధికారపార్టీవారి వేధింపులే దీనికి కారణం అని బంధువులు ఆరోపిస్తున్నారు. 

అమలాపురం :  కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేధింపులతో ఓ పంచాయతీ కార్యదర్శి suicide చేసుకుంది.  ఉప్పలగుప్తం మండలం చెర్లపల్లి panchayat secretary ఎస్టి మహిళ  అయిన  రొడ్డా భవాని(32)  గురువారం అమలాపురం మండలం కామనగరువులోని తన సొంత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త వెంకటేశ్వరరావు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన భవాని పదేళ్లక్రితం వెంకటేశ్వరరావును వివాహం చేసుకుంది. ఈమె 2019లో చల్లపల్లి పంచాయతీ కార్యదర్శిగా వచ్చారు. 

మూడు నెలల క్రితం పంచాయతీ పాలకవర్గ సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే 90 రోజుల గడువు దాటిన మూడు రోజులకు సమావేశం నిర్వహించారు. అప్పటి నుంచి కొందరు  ఆమెను వేధిస్తున్నారు. ఆ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. భవాని మృతదేహాన్ని అమలాపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు గురువారం సాయంత్రం వరకు ప్రయత్నించారు. డీఎస్పీ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని భవాని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఓ దశలో వాగ్వాదం చోటు చేసుకోగా సిఐ వీరబాబు,  ఎస్సై  పరదేశి కలగజేసుకుని సర్ది చెప్పారు. భవాని భర్త వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ఆత్మహత్యకు అదే కారణమా?
ఎస్టీ మహిళ అయిన భవానికి అధికార పార్టీకి చెందిన కొందరు నుంచి వేధింపులు ఎదురయ్యాయి అని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ పాలకవర్గ సమావేశం సమయానికి నిర్వహించలేదని ఒక వర్గం వారు జిల్లా పంచాయతీ అధికారికి, కలెక్టర్కు ఫిర్యాదు చేశారని.. ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటే తమకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్పారు. ఆ మొత్తం ఇచ్చాక కూడా మరికొంత అడగడంతో పాటు తీవ్రంగా విభేదించడం వల్లే భవాని ఆత్మహత్య చేసుకున్నట్లు వారు ఆరోపించారు. 

జగన్ జాబ్ క్యాలెండర్ పై సైటైరికల్ కార్టూన్ తో పవన్ కల్యాణ్ ట్వీట్..

ఇదిలా ఉండగా, జూలై 6న విశాఖపట్నానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పెంకా రాజేష్ పై హత్యాయత్నం విషయంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో భీమిలి మెజిస్ట్రేట్ విజయలక్ష్మి, ఆమె సోదరి, నగరంలో ఎస్సైగా పనిచేస్తున్న నాగమణి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఈ నెల మూడో తేదీన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో మహారాణిపేట ఎస్ఐ సోమశేఖర్ ఈ విషయాన్ని పొందుపరిచారు. దీని ప్రకారం.. నగరంలో కలెక్టరేట్ సమీపంలో నివాసం ఉంటున్న పెంకా రాజేష్ (39),  ఇది గతనెల 18న ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు వెనకనుంచి ఇనుప రాడ్ తో దాడి చేశారు.

బాధితుడి వాంగ్మూలం ఇచ్చాడు. దీని ప్రకారం మహారాణి పేట పోలీసులు ఘటనా స్థలంలోనే సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన దర్యాప్తును వేగవంతం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులు ఉపయోగించిన బైక్ ఆధారంగా.. వన్ టౌన్ ప్రాంతానికి చెందిన రామస్వామి, రాజు అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. వారిద్దరూ నేరాన్ని అంగీకరించారు. అయితే బాధితుడితో తమకు ఎలాంటి పరిచయము లేదని తమకు సుపారీ ఇస్తామని అప్పల రెడ్డి,  తరుణ్ అనే వ్యక్తులు చెప్పడంతోనే అలా చేశామని తెలిపారు. తరుణ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారించారు.  

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు, ఈ తెలుగు జిల్లాల్లోనూ.. ఎల్లో అలర్ట్ జారీ
Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu