వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు

By narsimha lodeFirst Published Sep 17, 2018, 12:30 PM IST
Highlights

వైసీపీలో వంగవీటి రాధాకు ప్రాధాన్యం తగ్గుతోందా..  తాను కోరుకొన్న సెంట్రల్ సీటు కాకుండా  మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం చెప్పడంతో రాధా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం

విజయవాడ: వైసీపీలో వంగవీటి రాధాకు ప్రాధాన్యం తగ్గుతోందా..  తాను కోరుకొన్న సెంట్రల్ సీటు కాకుండా  మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం చెప్పడంతో రాధా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. 

ఆదివారం నాడు జరిగిన పార్టీ సమావేశం నుండి  రాధా  ఆగ్రహాంతో బయటకు వెళ్లిపోయాడని తెలుస్తోంది. టిక్కెట్టు విషయమై  తాను  జగన్ వద్దే తేల్చుకొంటానని రాధా అన్నాడని సమాచారం. ఇదిలా ఉంటే రాధా పట్ల  పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ వంగవీటి శ్రీనివాస్  పార్టీకి రాజీనామా చేశారు.

కృష్ణా జిల్లా వైసీపీలో  అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి  వైసీపీలో  గత ఏడాది మల్లాది విష్ణు వైసీపీలో చేరారు.  2014 ఎన్నికల్లో మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్  సీటు నుండి పోటీ చేశారు.  వంగవీటి రాధా విజయవాడ తూర్పు నుండి పోటీ చేసి ఓడిపోయాడు.

విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్‌లో  పార్టీ కార్యక్రమాల్లో రాధా  పాల్గొంటున్నారు. ఈ తరుణంలోనే మల్లాది విష్ణు పార్టీలో చేరడంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో  రాధాకు  ఇబ్బందులు ఎదురౌతున్నాయి.  ఇద్దరూ నేతలు కూడ ఒకే నియోజకవర్గంలో  పనిచేస్తున్నారు.

దీంతో మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ బాధ్యతలను కేటాయిస్తున్నట్టు  ఆదివారం నాడు  నిర్వహించిన సమావేశంలో పార్టీ నేత పెద్దిరెడ్డి ప్రకటించారు. దీంతో ఈ సమావేశం నుండి వంగవీటి రాధాతో ఆగ్రహంగా వెళ్లిపోయారనే సమాచారం.

విజయవాడ సెంట్రల్ సీటునుండి తాను పోటీ చేస్తానని వంగవీటి రాధా ప్రకటించి వెళ్లిపోయినట్టు సమాచారం. అయితే గడగడపకు వైసీపీ కార్యక్రమాన్ని సోమవారం నాడు ప్రారంభించాల్సి ఉంది.  

అయితే  విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మాత్రం గడపగడపకు వైసీపీ కార్యక్రమం ప్రారంభం కాలేదు. విజయవాడలోని ఇతర సెగ్మెంట్లో మాత్రం  ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లికి వ్యతిరేకంగా పలువురు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి వంగవీటి రాధా అండదండలు ఉన్నాయని వెలంపల్లి భావిస్తున్నారు. 

ఇదే విషయమై అధిష్ఠానానికి కూడా ఆయన గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో సాక్షాత్తు పెద్దిరెడ్డి రంగంలోకి దిగి పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 

మరోవైపు సెంట్రల్‌ నియోజకవర్గంలోనూ వంగవీటి రాధా, మల్లాది విష్ణు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రాధాకు చెక్‌ పెట్టేందుకు ఇదే అదనుగా భావించిన వెలంపల్లి సెంట్రల్‌ నియోజకవర్గం బాధ్యతలను మల్లాది విష్ణుకు దక్కేలా పావులు కదపడం ప్రారంభించారు. 

వెలంపల్లి వర్గానికి పెద్దిరెడ్డి ఆశీస్సులు ఉండటంతో ఆయన పని మరింత సులువు అయింది. ఆదివారం నాటి సమావేశంలో సెంట్రల్‌ నియోజకవర్గం బాధ్యతలు మల్లాదికే అని చెప్పించడంలో వెలంపల్లి వర్గం విజయవంతమైంది.
 
అయితే వంగవీటి రాధాను మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ నుండి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం వంగవీటి రాధాకుచ సూచించినట్టు ప్రచారం సాగుతోంది. మచిలీపట్నం పార్లమెంట్ సీటు కాకుండా  విజయవాడ సెంట్రల్ సీటులోనే  పోటీకి సుముఖంగా ఉన్నారు.

ఇదిలా ఉంటే వంగవీటి రాధా సోదరుడు  వంగవీటి శ్రీనివాస్ సోమవారం నాడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

click me!