జేసీ దివాకర్ రెడ్డికి బాబు ఫోన్: న్యాయ విచారణ చేయిస్తామని హామీ

Published : Sep 17, 2018, 10:46 AM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
జేసీ దివాకర్ రెడ్డికి బాబు ఫోన్: న్యాయ విచారణ చేయిస్తామని  హామీ

సారాంశం

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు. 


అనంతపురం: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు. అనంతపురం జిల్లా చిన్నపొడమలలో గ్రామస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం నుండి నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

గణేష్ నిమజ్జనం  సందర్భంగా ప్రబోధానంద ఆశ్రమంలోని భక్తులు.. గ్రామస్తులపై దాడి చేయడం.. దీనికి ప్రతిగా గ్రామస్తులు పెట్రోలు బాంబులను ఆశ్రమంపైకి వేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

దీంతో గ్రామస్తులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  ఆందోళన కొనసాగిస్తున్నారు.ఈ విషయం తెలుసుకొని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం నాడు ఉదయం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఫోన్ చేశాడు.  బాబు ఫోన్ చేసిన సమయంలో అనంతపురం ఎంపీ  జేసీ దివాకర్ రెడ్డి దీక్షలోనే ఉన్నారు.

తాడిపత్రి త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు.  అయితే  గ్రామస్తులకు న్యాయం చేయాలని జేసీ దివాకర్ రెడ్డి తనకు ఫోన్ చేసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కోరారు. 

ఆశ్రమాన్ని ఖాళీ చేయించాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకొంటామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి హామీ ఇచ్చారు.

ఈ వార్తలు చదవండి

ఆశ్రమంపై చర్యలు తీసుకోండి.. రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందే కూర్చొన్న జేసీ

చిన్నపొడమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ముందు జేసీ ధర్నా

గణేష్ నిమజ్జనంతో చిన్నపొడమలలో ఉద్రిక్తత: జేసీ దివాకర్ రెడ్డి నిరసన

 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే