ఆశ్రమంపై చర్యలు తీసుకోండి.. రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందే కూర్చొన్న జేసీ

By Arun Kumar PFirst Published Sep 17, 2018, 8:43 AM IST
Highlights

అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని చిన్నపొలమడలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ప్రబోధానంద ఆశ్రమంలోని భక్తులు.. గ్రామస్తులపై దాడి చేయడం.. దీనికి ప్రతిగా గ్రామస్తులు పెట్రోలు బాంబులను ఆశ్రమంపైకి వేయడంతో అక్కడ యుద్ధవాతావరణం నెలకొంది.

ఈ ఘటనలో పలువురు గ్రామస్తులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం నేరుగా తాడిపత్రి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి రోడ్డు మీదే బైఠాయించారు. గ్రామస్తులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి ఆశ్రమాన్ని ఖాళీ చేయించి... నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దివాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి రాత్రంతా స్టేషన్ ముందే కూర్చొని ఉన్నారు. పలువురు ఉన్నతాధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా జేసీ పంతం వీడలేదు. మరోవైపు నిన్న ఘర్షణల్లో ఫక్కీరప్ప అనే వ్యక్తి మరణించగా.. తీవ్రంగా గాయపడిన పెద్దిరెడ్డి అనే వ్యక్తిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఊరేగింపును ఆశ్రమం మీదుగా వెళ్లడానికి ప్రబోధానంద ఆశ్రమంలోని భక్తులు అభ్యంతరం తెలపడం.. ఘర్షణకు కారణమైంది.

చిన్నపొడమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ముందు జేసీ ధర్నా

గణేష్ నిమజ్జనంతో చిన్నపొడమలలో ఉద్రిక్తత: జేసీ దివాకర్ రెడ్డి నిరసన

click me!