స్టీల్ ప్లాంట్ రగడ: ప్రైవేటీకరణ వద్దు.. అమిత్ షాను కలిసిన వైసీపీ ఎంపీలు

By Siva KodatiFirst Published Feb 12, 2021, 7:14 PM IST
Highlights

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు వైసీపీ ఎంపీలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పున: సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీలు కలిసిన సంగతి తెలిసిందే

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు వైసీపీ ఎంపీలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పున: సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీలు కలిసిన సంగతి తెలిసిందే.

సోమవారం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డి, ఎంపీలు బాలశౌరి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, బి.సత్యవతి కేంద్రమంత్రితో భేటీ అయ్యారు.

కాగా, అంతకుముందు స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రధానికి మోదీకి జగన్‌ లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచించాలని ఆయన కోరారు. ప్లాంటును బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించాలన్నారు.

Also Read:చంద్రబాబు, జగన్‌లను ఒకే వేదికపైకి తీసుకు రావాలి: సీపీఐ నారాయణ సూచన

విశాఖ ఉక్కు ద్వారా దాదాపు 20 వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని.. పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారని ప్రధానికి సీఎం తెలిపారు. ప్లాంటు పరిధిలో 19,700 ఎకరాల విలువైన భూములు ఉన్నాయన్న జగన్.. ఈ భూముల విలువే దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఉంటుందన్నారు.

ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం వల్లే ప్లాంటుకు నష్టాలు వచ్చాయన్నారు. స్టీల్‌ ప్లాంటుకు సొంతంగా గనులు లేవన్న జగన్.. పెట్టుబడుల ఉపసంహరణకు బదులు అండగా నిలవడం ద్వారా ప్లాంటును మళ్లీ ప్రగతిబాటలోకి తీసుకెళ్లవచ్చన్నారు.

click me!