నడిరోడ్డుపై బ్యాలెట్ పేపర్లు... ఇద్దరు అధికారులపై కలెక్టర్ వేటు

By Siva KodatiFirst Published Feb 12, 2021, 6:14 PM IST
Highlights

శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మేజర్ పంచాయతీలో బ్యాలెట్ పేపర్ల కలకలం ఘటనలో ఎన్నికల కమీషన్ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఇద్దరు గ్రామ పంచాయతీ రిటర్నింగ్ అధికారులపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.

శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మేజర్ పంచాయతీలో బ్యాలెట్ పేపర్ల కలకలం ఘటనలో ఎన్నికల కమీషన్ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఇద్దరు గ్రామ పంచాయతీ రిటర్నింగ్ అధికారులపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.

స్టేజ్- 2 రిటర్నింగ్ అధికారి అసిస్టెంట్ ఎల్ గోవర్థన్ రావు, స్టేజ్ - 2 రిజర్వ్ రిటర్నింగ్ అధికారిగా అసిస్టెంట్ వి. మల్లేశ్‌లను సస్పెండ్ చేస్తూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

పోలింగ్ తర్వాత బ్యాలెట్ పేపర్ భద్రపరచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వీరిపై ఆరోపణలు వచ్చాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 134 కింద ఏపీ సర్వీస్ రూల్స్ కింద ఎస్ఈసీ చర్యలు చేపట్టింది.

అలాగే అనుమతి లేకుండా ప్రధాన కేంద్రం విడిచి వెళ్లరాదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, బుధవారం పోలింగ్‌ కేంద్రం వద్ద ఉంగరం గుర్తుపై స్వస్తిక్ ముద్ర వేసిన బ్యాలెట్‌ పత్రాలు కొందరికి కనిపించాయి.

వాటిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేసినట్లు తెలుస్తోంది. అయితే కొందరు చిన్నారులు ఈ బ్యాలెట్‌ పత్రాలను ఇళ్లకు తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎల్‌.ఎన్‌.పేటలో మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని అభ్యర్థి మన్మథరావు కోరుతున్నారు.
 

click me!