
అమరావతి: టిడిపి డిజిటల్ మహానాడులో ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ పై వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి జగన్ ఒంటరి అయిపోతారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ...ముందు నీ పార్టీ ఏమవుతుందో చూసుకో అంటూ హెచ్చరించారు
''పిల్లి శాపాలకు ఉట్లు తెగవు బాబూ. 2024 ఎన్నికల గురించి ఇప్పుడే జోస్యాలు చెబ్తున్నావు. వచ్చే మహానాడు వరకు నీ పార్టీ ఉంటుందో లేదో చూసుకో. మూడేళ్ల తర్వాత జగన్ గారి వెంట ఎవరూ మిగలరని శోకాలు పెడుతున్నావు. అచ్చెన్నతో సహా సీనియర్లందరికి భవిష్యత్తు అర్థమవుతోంది. భ్రమల నుంచి బయటపడు'' అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.
''యూ టర్నుల బాబు ప్రత్యేక హోదా కోసం నిస్సిగ్గుగా మళ్లీ తీర్మానం చేయించాడు. అప్పట్లో ప్యాకేజే ముద్దు అని కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన సంగతి ఎవరూ మర్చిపోలేదు. నా దగ్గర చిప్ప మాత్రమే ఉంది. డబ్బు ఉంటే నీకో లక్ష ఇచ్చే వాడిని అనే తుపాకి రాముడి కామెడీ గుర్తొస్తోంది'' అని ఎద్దేవా చేశారు.
''బాబు ఆలోచనలు సొంత పార్టీ వాళ్లకీ అంతుబట్టనంత లోతుగా ఉంటాయి. 50 ఇళ్లకో కార్యకర్తను నియమిస్తాడట. కామెడీ ఏమిటంటే, వాళ్లను మాలోకం లీడ్ చేస్తాడట. ఏ ఇంట్లో పప్పు వండారో ఆరా తీయించడానికా కొడుక్కి పెత్తనం అని జనం నవ్వుకుంటున్నారు'' అని లోకేష్ పై సెటైర్లు విసిరారు.
read more ప్యాంటు తడిసిపోతే ఎలాగన్న విజయసాయి... రామ్మోహన్ నాయుడు ఘూటు రిప్తై
''రాష్ట్రంలో ప్రజలు - ప్రభుత్వం కరోనాతో పోరాడుతుంటే - చంద్రబాబు అండ్ కో కుల రాజకీయాలపై దృష్టి పెట్టింది. ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతిపక్ష నాయకుడు జూమ్ లో కుల కలం రేపుతున్నాడు. రోజుకు నాలుగైదు గంటలు కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టే చర్చలు జరుపుతున్నాడు'' అని విజయసాయి ఆరోపించారు.
''పార్టీకి 25% టైం ఇచ్చి ఉంటే అధికారం పోయేది కాదు అని జూమ్ లో కన్నీళ్లు పెట్టాడు బాబు. దోచుకోవడం, జనాల్ని భ్రమల్లో ముంచడంతోనే కాలం గడిచిపోయింది. ఓడిన తర్వాత కూడా హెరిటేజ్ మీద పెట్టిన దృష్టి ప్రజా సమస్యల మీద పెట్టావా? అందుకే పార్టీ లేదు బొక్కా లేదు అన్నది అచ్చెన్న'' అని గుర్తుచేశారు.
''ఆయన కారణ జన్ముడని మాట వరసకు లేపుతున్నావు. కానీ, నీవల్లే ఆయన అకాల మరణం పాలయ్యాడని అందరికీ తెలుసు. సీఎం పదవిని, పార్టీని లాక్కుని నడిరోడ్డున పడేయకుంటే ఇంకో 20 ఏళ్లు జీవించి ఉండేవాడు. నీ కుట్రల వల్లే విశ్వవిఖ్యాత నటుడు అర్ధాంతరంగా కన్ను మూశాడు'' అని వరుస ట్వీట్ల ద్వారా చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు.