
తెలంగాణకు చెందిన ఓ పోలీస్ అధికారితో టీడీపీ అధినేత చంద్రబాబు కుమ్మక్కయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ (Ysrcp) ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy). ఆ అధికారిపై తెలంగాణ సీఎంవోకు ఫిర్యాదు చేస్తానని.. చంద్రబాబుతో కుమ్మక్కయిన పోలీస్ అధికారి పక్క రాష్ట్రంలో తనకు తెలిసిన పోలీసులతో ఏపీలో దాడులు చేయిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అయితే ఆయన పేరు ఇప్పుడు చెప్పానని విజయసాయి అన్నారు. ఆ అధికారి మహారాష్ట్ర, తెలంగాణ, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారులతో వున్న ఫ్రెండ్‌షిప్‌తో అరకులో దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అంతకుముందు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడిపై (chandrababu naidu) గుప్పించారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బృందానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (narendra modi), కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah) అపాయింట్ మెంట్లు దొరకలేదన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ అధినేతకు విజయసాయిరెడ్డి చురకలంటించారు. ఆయనను మీడియా కూడా పట్టించుకోవట్లేదంటూ విజయసాయి ఎద్దేవా చేశారు.
'ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు అడుగు పెట్టగానే పులి దిగింది, సింహం దిగిందంటూ అరుపులు, నినాదాలు చేశారని ఆయన దుయ్యబట్టారు. పడిగాపులు కాసినా కేంద్ర పెద్దల అపాయింట్‌మెంట్లు లేవని.. మీడియా పట్టించుకోలేదని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అతని నైజం తెలియడంతో ఏ పార్టీ కూడా దరిచేరనీయలేదని.. హడావుడి చేద్దామని వచ్చి అభాసుపాలై ఢిల్లీ నుంచి జారుకున్నాడు అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.
చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. అసాంఘీక శక్తులకు రారాజు చంద్రబాబేనని.. ఢిల్లీలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి వచ్చారా అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఏపీ పరువు తీశామని చెప్పుకోవడానికి చంద్రబాబు ఢిల్లీ వచ్చారా అంటూ మండిపడ్డారు. ఆర్టికల్ 356ని (article 356) రద్దు చేయాలని గతంలో కోరిన చంద్రబాబు ఇప్పుడు అదే కావాలంటున్నారని.. పట్టాభి (pattabhi) బూతుపురాణం వీడియోను రాష్ట్రపతికి ఇచ్చారా అని విజయసాయిరెడ్డి నిలదీశారు.
చంద్రబాబు 36 గంటల పాటు బూతు దీక్ష చేశారని.. పట్టాభి తిట్లను సమర్ధించుకోవడానికే ఢిల్లీ వచ్చారా అంటూ ఆయన మండిపడ్డారు. అమిత్ షా మీద రాళ్లు వేసిన వీడియోను చూపించారా... గంజాయి (ganja) వ్యాపారంలో లోకేశ్‌కు (nara lokesh) భాగస్వామ్యం ఉందని ప్రజలందరికీ తెలుసునని విజయసాయి ఆరోపించారు. చంద్రబాబు నాయుడే ఒక టెర్రరెస్టు అని అసాంఘిక శక్తుల్ని ఆయన ప్రోత్సహిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ అడిగితే, ఇవ్వలేదని విజయసాయి దుయ్యబట్టారు. ఉద్దేశ్యపూర్వకంగానే పట్టాభితో తిట్టించారని.. ఆయన వ్యాఖ్యలపై సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని ఆయన చెప్పారు.