టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని నియమించడంపై హైకోర్టు సీరియస్.. వారికి నోటీసులు..

By team teluguFirst Published Oct 27, 2021, 2:10 PM IST
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో (TTD Board) నేర చరిత్ర ఉన్నవారిని సభ్యులుగా నియమించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh) ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. 

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో (TTD Board) నేర చరిత్ర ఉన్నవారిని సభ్యులుగా నియమించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh) ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. భాను ప్రకాష్ తరఫున న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. భారత వైద్య మండలి మాజీ చైర్మన్ కేతన్ దేశాయ్‌ను పాలకమండలి సభ్యుడిగా నియమించడంపై అశ్వినీ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ టీటీడీ కార్య నిర్వహణాధికారికి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మొత్తం 18 మంది సభ్యులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని తెలిపింది.

Also: ఏపీ నార్కోటిక్స్ హబ్‌గా మారింది.. ట్విట్టర్‌లో సంచన పోస్టులు చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణ పోలీసుల వీడియోలతో..

ఇక, టీటీడీ నూతన బోర్డును నియమకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా జీవోలు జారీచేసిన సంగతి తెలిసిందే. టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండో సారి అవకాశం కల్పించిన జగన్ సర్కార్.. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నలుగురు అధికారులతో పాటు 24 మందిని సభ్యులుగా నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌కు అవకాశం కల్పించారు. వీరికి తోడు గతంలో ఎప్పుడూ లేనంతగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.

Also read: 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఏపీలో వర్షాలు..

టీటీడీకి జంబో పాలకవర్గం ఏర్పాటు చేయడాన్ని టీడీపీ సహా పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జగన్ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించాయి. ఈ జీవోలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారించిన ఏపీ హైకోర్టు ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించిన జీవోను సస్పెండ్ చేసింది. మరోవైపు టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో నేర చరిత్ర ఉన్నవారిని నియమించారంటూ గత కొద్ది రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

click me!