జగన్‌కు ఝులక్.. కేంద్ర మంత్రితో నేను మాట్లాడతా, మండలి రద్దుపై మళ్లీ కెలికిన రఘురామ

By Siva KodatiFirst Published Oct 16, 2021, 6:06 PM IST
Highlights

ఏపీ ప్రభుత్వం (ap govt), ముఖ్యమంత్రి (ap cm) వైఎస్ జగన్‌ (ys jagan)పై మరోసారి విమర్శలు గుప్పించారు వైసీపీ (ysrcp) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (raghu rama krishnam raju). శాసనమండలిని రద్దు (ap legislative council abolish) చేయాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని, పార్టీ ఎంపీగా ఈ విషయమై తాను కూడా న్యాయశాఖ మంత్రిని ((union law minister) కలిసి కోరతానని రఘురామ స్పష్టం చేశారు

ఏపీ ప్రభుత్వం (ap govt), ముఖ్యమంత్రి (ap cm) వైఎస్ జగన్‌ (ys jagan)పై మరోసారి విమర్శలు గుప్పించారు వైసీపీ (ysrcp) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (raghu rama krishnam raju). శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...  శాసనమండలిని రద్దు (ap legislative council abolish) చేయాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని, పార్టీ ఎంపీగా ఈ విషయమై తాను కూడా న్యాయశాఖ మంత్రిని ((union law minister) కలిసి కోరతానని రఘురామ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కరెంట్‌ కోతలు (power cuts) ప్రారంభమయ్యాయని ఆయన మండిపడ్డారు. ఆక్వా సాగు ((aquaculture) ప్రాంతాల్లో రోజుకు మూడు గంటలు చొప్పున విద్యుత్‌ కోత విధిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు దుయ్యబట్టారు. తాను ఢిల్లీలో ఉన్నప్పటికీ  రాష్ట్ర ప్రజల గురించే ఆలోచిస్తున్నట్టు తెలిపారు. విద్యుదుత్పత్తికి బొగ్గు ఇవ్వలేని వారు.. ఆక్వాకు సీడ్‌, ఫీడ్‌ ఎలా ఇస్తారని రఘురామ ప్రశ్నించారు. బొగ్గుపై (coal shortage) సీఎం జగన్‌ రాసిన లేఖకు ప్రధాని (narendra modi) స్పందించారనేది నిజమేనా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విద్యుత్‌పై సీఎం జగన్‌ ప్రణాళిక రూపొందించాలని రఘురామ సూచించారు.

ALso Read:మండలి రద్దుపై రఘురామ పావులు.. కేంద్రానికి లేఖ, జగన్ కోరికను నెరవేర్చాలంటూ వినతి

కాగా, గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ కృష్ణంరాజు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై (sajjala rama krishna reddy) సెటైర్లు వేశారు. జగన్ నవరత్నాల్లో ఒక రత్నం రాలిపోయిందని ఎద్దేవా చేశారు. అమ్మఒడి (amma vodi) నిధులను జూన్ నెలకు మార్చడంతో ఒక ఏడాది ఎగ్గొట్టినట్లేనని రఘురామ దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో అమ్మఒడిని నమ్ముకున్న చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ సమస్య తలెత్తినా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే మాట్లాడుతున్నారని... ఆయన ఒక్కోసారి సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రేపో మాపో సజ్జల మంత్రి అవుతారని... అప్పుడు ఆయన ఒక మంత్రిత్వ శాఖను మాత్రమే చూస్తారా? లేక సకల శాఖలను చూస్తారా? అంటూ రఘురామ సెటైర్లు వేశారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 2.87 లక్షల కోట్ల అప్పులు (ap loans) చేశారని... ప్రభుత్వ ఖజానాలోని రూ. 1.31 లక్షల కోట్లకు లెక్కలు కూడా తేలడం లేదని రఘురామరాజు అన్నారు. ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, అప్పులపై పూర్తి వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్య (power crisis) వల్ల రాష్ట్రం అంధకారంలోకి వెళ్లే పరిస్థితులు తలెత్తాయని దుయ్యబట్టారు. జగనన్న కొవ్వొత్తి-అగ్గిపెట్టె పథకం పెట్టేటట్టు ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని రఘురామ ఎద్దేవా చేశారు. విద్యుత్ సమస్యపై కోల్ ఇండియా ఛైర్మన్‌తో తాను చర్చించానని...  కోల్ ఇండియాకు ఏపీ రూ. 300 కోట్ల బాకీ ఉందని ఆయన తనతో చెప్పారని రఘురామ తెలిపారు.

   

click me!