మా లేఖల్లో రాజకీయం వెతికారు.. జిల్లాపై ఏమాత్రం శ్రద్ధ లేదు: జగన్‌కు ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

By Siva KodatiFirst Published Oct 16, 2021, 4:07 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (ap cm)  వైఎస్ జగన్‌కు (ys jagan) శనివారం ప్రకాశం జిల్లా (prakasam district) టీడీపీ (tdp) ఎమ్మెల్యేలు మరో లేఖ రాశారు. తమ జిల్లా సమస్యలపై మీకు శ్రద్ధ లేదని వారు ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (ap cm)  వైఎస్ జగన్‌కు (ys jagan) శనివారం ప్రకాశం జిల్లా (prakasam district) టీడీపీ (tdp) ఎమ్మెల్యేలు మరో లేఖ రాశారు. తమ జిల్లా సమస్యలపై మీకు శ్రద్ధ లేదని వారు ఆరోపించారు. తాము గతంలో రాసిన లేఖల్లో రాజకీయాన్ని వెతికారంటూ జగన్‌పై మండిపడ్డారు. ట్రిపుల్ ఐటీ (III IT)శాశ్వత భవనం ఎక్కడ..? యూనివర్సిటీ నిర్మాణం ఎప్పుడు.. రామాయపట్నం (ramayapatnam port) పోర్టుని ఎందుకు దారి మళ్లిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. నిత్యావసర వస్తువులు, విద్యుత్ బిల్లులు పెంచేశారని ... ఇప్పుడు కూడా ఇంకా సంక్షేమం అని ఎలా అంటారు అని టీడీపీ నేతలు మండిపడ్డారు. గెజిట్ నోటిఫికేషన్ (gazette notification) అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో సీఎం జగన్‌కు ప్రకాశం జిల్లా నేతల లేఖ సంచలనం సృష్టించింది. 

వైఎస్ జగన్‌కు ఆగస్టు 24న ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా స్వప్నం వెలిగొండ ప్రాజెక్ట్ అని (pula subbaiah veligonda project) లేఖలో అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య (krmb) బోర్డుకు తెలంగాణ సర్కార్ (telangana govt( లేఖ రాసిందని టీడీపీ నేతలు గుర్తుచేశారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను గెజిట్‌లో చేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఎద్దేవా చేశారు. కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్ట్‌ను గెజిట్‌లో చేర్పించాలని కోరుతున్నామన్నామని టీడీపీ నేతలు లేఖలో పేర్కొన్నారు. గెజిట్‌లో చేర్చకుంటే వెలిగొండ ప్రాజెక్ట్ ప్రశ్నార్థకం అవుతోందని .. ఉమ్మడి ఏపీలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతం ప్రకాశం జిల్లా అని వారు గుర్తుచేశారు. కరువు కాటకాలతో ప్రకాశం జిల్లా ఎడారిగా మారుతోందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read:వెలిగొండను గెజిట్‌లో చేర్చండి.. లేదంటే మా జిల్లా ఎడారే: సీఎం జగన్‌కు ప్రకాశం టీడీపీ నేతల లేఖ

ఆ తర్వాత ఆగస్టు 31న కేంద్ర జల్‌శక్తి మంత్రి (union jal shakti minister) గజేంద్ర సింగ్ షెకావత్‌‌తో (gajender singh shaktawat) టీడీపీ నేతలు ఢిల్లీలో భేటీ అయ్యారు. వెలిగొండ ప్రాజెక్టు సమస్యపై కేంద్రమంత్రిని టీడీపీ బృందం కలుసుకుంది. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టును తక్షణమే అనుమతి పొందిన ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రకాశం జిల్లాలో కరువు పరిస్థితి, ప్రాజెక్టు ప్రాధాన్యతను గజేంద్ర సింగ్ షెకావత్‌కు నేతలు వివరించారు. టీడీపీ నేతల విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. జల్‌శక్తి మంత్రిని కలిసిన వారిలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు

click me!