సుఖాంతమైన మూడు రోజుల పసికందు కిడ్నాప్.. తల్లి ఒడికి బాలుడు.. (వీడియో)

By AN Telugu  |  First Published Oct 16, 2021, 3:02 PM IST

నిందితులను అదుపులోకి తీసుకుని, బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. తల్లిదండ్రులు, బంధువులు, ఆస్పత్రి సిబ్బంది పోలీసుల చర్యకు హర్షాతిరేఖాలు వ్యక్తం చేశారు. 


గుంటూరు, జిజిహెచ్ లో అదృశ్యమైన బాలుడు ఆచూకి లభ్యమయ్యింది. కొత్తపేట పోలీసులు. బాలుడితో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. CC TV footageలో గుర్తించిన వారే బాలుడు ను అపహరించినట్లు నిర్దారణకు వచ్చారు..

"

Latest Videos

undefined

నిందితులను అదుపులోకి తీసుకుని, బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. తల్లిదండ్రులు, బంధువులు, ఆస్పత్రి సిబ్బంది పోలీసుల చర్యకు హర్షాతిరేఖాలు వ్యక్తం చేశారు. 

కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని Guntur జిల్లాలోని ప్రభుత్వ hospital నుంచి మూడు రోజుల పసికందును దుండగులు kidnap చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది.

గుంటూరు సమీపంలోని పెదకాకానికి చెందిన ప్రియాంక ఈ నెల 12న జీజీహెచ్ ఆస్పత్రిలో ప్రసవించారు. ప్రియాంకకు బాలుడు జన్మించాడు. ఆ శిశువును తాత, అమ్మమ్మలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 15వ తేదీ అర్ధరాత్రి దాటాక సుమారు 1.30 గంటల ప్రాంతంలో బాబును వార్డు బయటకు తీసుకువచ్చారు. అక్కడే కాసేపు ఆడించారు. అనంతరం బాబును పక్కనే ఉంచుకుని నిద్రపోయారు.

ఇదే అదనుగా కొందరు దుండగులు తమ పథకం అమలు చేశారు. ఆ వృద్ధుల పక్కనే పడుకున్న శిశువును గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. కాసేపటికి మెలకువకు వచ్చిన ఆ ముసలివాళ్లు పక్కన బాబు లేకపోవడంతో హతాశయులయ్యారు. వెంటనే జీజీహెచ్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అనంతరం ఓ ఇద్దరు అనుమానితులను గుర్తించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. శిశువు అదృశ్యంతో పెదకాకానికి చెందిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

అయితే ఒక్క రోజులోనే పోలీసులు ఈ కేసును చేధించడం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించడం మీద సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా సమక్షంలో పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. 

click me!