ఏపీలో తిరోగమన పాలన, పరిశ్రమలన్నీ గుడ్‌బై.. హైదరాబాద్‌కు పెరుగుతున్న వలసలు: రఘురామ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 10, 2021, 3:36 PM IST
Highlights

ఏపీ నుంచి హైదరాబాద్‌కు వలసలు పెరిగిపోయాయని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఉన్న పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచి పోతున్నాయని, ఏపీలో కొత్తగా పరిశ్రమలు వచ్చే పరిస్థితి కనబడటంలేదని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరోగమన పాలన జరుగుతోందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విశాఖలో కబ్జాల పర్వం పెరిగిపోయిందని ఆరోపించారు. ఏపీ నుంచి హైదరాబాద్‌కు వలసలు పెరిగిపోయాయని రఘురామ పేర్కొన్నారు. ఉన్న పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచి పోతున్నాయని, ఏపీలో కొత్తగా పరిశ్రమలు వచ్చే పరిస్థితి కనబడటంలేదని రఘురామ కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి సీఎం జగన్‌ విశాఖలో పాదయాత్ర చేస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు. ఏపీలో శాంతిభద్రతలు లేవని రఘురామ ఎద్దేవా చేశారు. 

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని దీనిపై రాష్ట్రపతి రామనాథ్ కొవింద్‌కు లేఖ రాశానని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ కూడా క్లారిఫికేషన్ అడిగారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 142శాతం బడ్జెట్ అంచనాలను మించి సర్కార్ అప్పులు చేసిందన్నారు. 

ALso Read:ఏపీ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. రాష్ట్రపతికి రఘురామ లేఖ

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూస్తుంటే పరిస్థితి అత్యంత భయంకరంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూలుతుందోననే భయం వేస్తోందన్నారు. బడ్జెట్ అంచనాలకు మించి రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు ఉన్నాయని రఘురామ వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోనుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

click me!