టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి ... పూర్తిగా ఆఫ్‌లైన్‌లో తరగతులు: పాఠశాలల రీఓపెన్‌పై మంత్రి ఆదిమూలపు వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Aug 10, 2021, 03:11 PM ISTUpdated : Aug 10, 2021, 03:12 PM IST
టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి ... పూర్తిగా ఆఫ్‌లైన్‌లో తరగతులు: పాఠశాలల రీఓపెన్‌పై మంత్రి ఆదిమూలపు వ్యాఖ్యలు

సారాంశం

ఈ నెల 16 నుంచి పాఠశాలల రీ ఓపెన్ నేపథ్యంలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ఏపీ వ్యాప్తంగా 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేశామని ఆదిమూలపు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16 నుంచి స్కూళ్లను పున: ప్రారంభిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన... కోవిడ్ ప్రోటోకాల్ పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ వ్యాప్తంగా 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేశామని ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఆన్‌లైన్ క్లాసులు జరగడం లేదని మంత్రి వెల్లడించారు. అలాగే ప్రైవేట్ స్కూళ్లలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించొద్దని ఆదేశించామని ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. ఆగస్టు 16 నుంచి ఆఫ్‌లైన్‌లోనే పూర్తి స్థాయిలో పాఠశాలలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 

Also Read:గుడ్‌న్యూస్:ఈ నెల 16‌ నుండి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు రెగ్యులర్ క్లాసులు

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ నుండి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు రెగ్యులర్ క్లాసులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఇప్పటికే గత నెల 12వ తేదీ నుండి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా సెకండియర్ విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ఇంటర్ బోర్డును ఆదేశించింది.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?